ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tejas Plane: కుప్పకూలిన తేజస్ విమానం.. గాల్లో చక్కర్లు కొట్టిన కొద్ది సేపటికే..

ABN, Publish Date - Mar 12 , 2024 | 05:04 PM

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్‌లోని ( Jaisalmer ) పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్‌లోని ( Jaisalmer ) పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. కల్లా కాలనీ సమీపంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సమచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించింది తేజస్ కుప్పకూలిపోవడం ఇదే మొదటిసారి పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో భారత్ శక్తి పేరిట సైనిక విన్యాసాలు కొనసాగుతున్న వేళ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా.. గతంలోనూ ఒడిశాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఢెంకనల్‌లో శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఓ పైలట్ సహా శిక్షణలో ఉన్న యువతి మృతి చెందారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 05:04 PM

Advertising
Advertising