ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tejaswi Yadav: 'నీట్' పేపర్ లీక్ సూత్రధారి నితీష్ కుమార్... తేజస్వి స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - Jun 21 , 2024 | 09:23 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'నీట్' ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తొలిసారి పెదవి విప్పారు. ఈ కేసులో తనను ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు.

పాట్నా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'నీట్' (NEET) ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) తొలిసారి పెదవి విప్పారు. ఈ కేసులో తనను ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. పేపర్ లీక్ కేసులో అమిత్ ఆనంద్, నితీష్‌ కుమార్‌ ప్రధాన సూత్రధారులని సంచలన ఆరోపణలు చేశారు. కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వి వ్యక్తిగత సహాయకుడికి పరిచయం ఉదంటూ బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తేజస్వి కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ కేసులో అసలైన సూత్రధారుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ప్రత్యారోపణ చేశారు.

JP Nadda: జేపీ నడ్డాకు కీలక బాధ్యతలు..!


'నీట్'పై 'ఇండియా' కూటమిది ఒకేమాట

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో 'ఇండియా' కూటమి ఒకే మాట మీద ఉందని తేజస్వి చెప్పారు. ''నీట్ పరీక్షను తక్షణం రద్దు చేయాలని మేము కోరుతున్నాం. బీజేపీ దగ్గర అన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నారు. దర్యాప్తు కోసం పీఎస్‌లు లేదా పీఏలను పిలిపించవచ్చు. అసలైన సూత్రధారుల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. నన్నో, నా పీఏనో ఇందులోకి లాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్‌లే. బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేపరు లీకేజీలు తప్పవనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు'' అని తేజస్వి అన్నారు.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 09:23 PM

Advertising
Advertising