2024 Elections: బీజేపీకి పెద్ద దెబ్బ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత
ABN, Publish Date - Mar 30 , 2024 | 09:04 PM
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. మరోవైపు కొందరు నేతలు పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. మరోవైపు కొందరు నేతలు పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు బీజేపీకే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు వస్తున్న తరుణంలో.. మెజారిటీ నేతలు ఆ పార్టీలోకి చేరుతున్నారు. అలాంటి బీజేపీని వీడి.. కొందరు నేతలు ఇతర ప్రతిపక్ష లేదా కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) చేరుతున్నారు. తాజాగా.. కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి పరిణామమే వెలుగు చూసింది.
IPL Fraud: ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు.. క్యూఆర్ కోడ్స్ పంపించి..
తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన 30 రోజుల తర్వాత బీజేపీకి చెందిన తేజస్విని గౌడ (Tejaswini Gowda) శనివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2004-2009 మధ్య కాంగ్రెస్ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె.. 2014లో బీజేపీలో చేరారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తిరిగి సొంతగూటికి చేరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, మీడియా & ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాషాయ పార్టీకి రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం మాటలని కాదు, చర్యలను నమ్ముతుందని అన్నారు. ఒకసారి చరిత్రని తిరగేస్తే.. దేశం కోసం కాంగ్రెస్ ఏం చేసిందో తెలుసుకోవచ్చని చెప్పారు. చిత్తశుద్ధితో తాను పార్టీ కోసం పని చేయాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లకు గాను 23 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని విశ్వాసం కూడా వ్యక్తం చేశారు.
CM Jagan: సీఎం జగన్‌పై చెప్పు.. సిద్ధం రోడ్ షోలో ఊహించని పరిణామం
ఇదే సమయంలో జైరాం రమేష్ (Jairam Ramesh) మాట్లాడుతూ.. కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) యాక్టివ్‌గా ఉండే తేజస్విని గౌడను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తేజస్విని యాక్టివ్‌గా ఉంటారని తమకు నమ్మకం ఉందన్నారు. 2004-2009 మధ్య తేజస్విని కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారని.. వివిధ సమస్యలపై ఆమె గళం విప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆమె తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇదిలావుండగా.. 2014లో బీజేపీలో చేరిన తేజస్విని గౌడ 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె కాషాయ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2024 | 09:04 PM