ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Reasi Terror Attack: బస్సుపై ఉగ్రదాడి.. అందరినీ చంపేయాలన్న కసి వారిలో..

ABN, Publish Date - Jun 15 , 2024 | 07:22 AM

జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఓ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని...

Terrorist Did Not Stop Firing At Bus After It Fell In Gorge Says Survivor

జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రియాసీ జిల్లాలో ఓ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి (Bus Terror Attack) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి ఆ బస్సు వెళ్తున్న సమయంలో.. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడి నుంచి తప్పించే క్రమంలో బస్సు లోయలో పడింది. అయితే.. లోయలో పడిన తర్వాత కూడా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని, ఆ భయంకరమైన క్షణాలను ఓ బాధితురాలు గుర్తు చేసుకుంది. అందరినీ చంపేయాలన్న కసితో ఆ ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారని ఆమె పేర్కొన్నారు.


జూన్ 9వ తేదీన చోటు చేసుకున్న ఈ ఉగ్రదాడిలో మొత్తం 9 మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు. ఆ గాయపడిన వారిలో నీలం గుప్తా (Neelam Gupta) అనే బాధితరాలు ఒకరు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో.. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బస్సులోనే ఉన్నారు. మిగతా కుటుంబీకులు గాయాల నుంచి కోలుకున్నారు కానీ, ఆమె సోదరుడు రాజేష్ గుప్తా పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ క్రమంలోనే ఆ క్షణాలను నీలం గుప్తా గుర్తు చేసుకుంటూ.. ‘‘ఉగ్రవాదులు కాల్పులు జరపడం మొదలుపెట్టగానే, బస్సు లోయలోకి పడిపోయింది. అయినా కూడా ఉగ్రవాదులు కాల్పులు ఆపలేదు. అక్కడికొచ్చి కొన్ని నిమిషాల పాటు కాల్పులు జరిపారు. వారి తీరు చూస్తే.. అందరినీ చంపేయాలన్న కసి వారిలో కనిపించింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.


ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ భయబ్రాంతులకు గురయ్యారని.. బుల్లెట్లు తగలకుండా ఉండేందుకు కింద పడుకున్నారని నీలం గుప్తా తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత కాల్పులు ఆగిపోయాయని, అక్కడి నుంచి ఉగ్రవాదులు వెళ్లిపోయారని అన్నారు. వాళ్లు వెళ్లారని నిర్ధారించుకున్నాక.. స్థానికులు అక్కడికి చేరుకొని, బాధితుల్ని ఒక్కొక్కరిగా బస్సులో నుంచి దింపారని చెప్పారు. కొంత సమయంలో భద్రతా సిబ్బంది సైతం సంఘటనా స్థలానికి చేరుకొని.. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో ఎడమ కాలు ఫ్చాక్చర్ అయ్యిందన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 07:22 AM

Advertising
Advertising