ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu And Kashmir: మార్కెట్‌పై ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి.. పలువురికి గాయాలు

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:09 PM

లోయలో గత కొద్ది రోజులుగా దాడులు, ఎన్‌కౌంటర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయనీ, ఈరోజు శ్రీనగర్‌లో సండే మార్కెంట్‌లో అమాయక దుకాణదారులపై గ్రనేడ్ దాడి జరగడం దురదృష్టకమని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను టార్గెట్ చేయడాన్ని ఏమాత్రం సమర్ధనీయం కాదదన్నారు.

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ (Srinagar) లో ఆదివారంనాడు గ్రెనేడ్ దాడి జరిగింది. టూరిస్ట్ రెసెప్షన్ సెంటర్ (TRC) సమీపంలో రద్దీగా ఉండే మార్గెట్‌పై ఉగ్రవాదులు ఈ దాడి జరిపారు. ఈ ఘనటలో పది మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతాగాత్రులను హుటాహుటిన ఎస్‌హెచ్ఎంసీ ఆసుపత్రిలో చేర్చారు. శ్రీనగర్‌లో వరుసగా రెండో చోటు ఉగ్ర ఘటనలకు చోటుచేసుకోవడంతో స్థానిక దుకణదారుల్లో ఆందోళన వ్యక్తమైంది.

Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్


సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందన

లోయలో గత కొద్ది రోజులుగా దాడులు, ఎన్‌కౌంటర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయనీ, ఈరోజు శ్రీనగర్‌లో సండే మార్కెట్‌లో అమాయక దుకాణదారులపై గ్రనేడ్ దాడి జరగడం దురదృష్టకమని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను టార్గెట్ చేయడాన్ని ఏమాత్రం సమర్ధనీయం కాదదన్నారు. భద్రతా బలగాలు సాధ్యమైనంత త్వరలో ఈ వరుస దాడులకు కళ్లెం వేయాలని, తద్వారా ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా జీవనం సాగించడం సాధ్యమవుతుందన్నారు.


డౌన్‌టౌన్ శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలు శనివారంనాడు లష్కరే తొయిబా టాప్ కమాండర్‌ ఒకరని మట్టుబెట్టిన క్రమంలో శ్రీనగర్‌లో తాజా దాడి చోటుచేసుకుందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చడంతో పాటు ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.


ఇవి కూడా చదవండి:

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన

Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పీంఛన్ పెంపు చేస్తాం

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 04:10 PM