ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ED : లిక్కర్‌ స్కాం నిందితుల జాబితాలో ‘ఆప్‌’ను చేర్చుతాం

ABN, Publish Date - May 15 , 2024 | 03:35 AM

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులోని నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా చేర్చుతామని ఈడీ మంగళవారం హైకోర్టుకు తెలిపింది.

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ఈడీ

న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులోని నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా చేర్చుతామని ఈడీ మంగళవారం హైకోర్టుకు తెలిపింది. త్వరలో దాఖలు చేయనున్న మరో ఛార్జిషీటులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని పేర్కొంది. అదే జరిగితే మనీలాండరింగ్‌ కేసులో నిందితునిగా ఓ రాజకీయ పార్టీని పేర్కొనడం ఇదే మొదటిసారి అవుతుంది.

ఈ కేసులో ఆప్‌ సీనియర్‌ నేత సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కుంభకోణం ద్వారా లభించిన సొమ్ము అంతా ఆప్‌కు వెళ్లినట్టు చెబుతున్నా ఆ విషయాన్ని ఛార్జిషీటులో ఎందుకు పేర్కొనలేదని బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ప్రశ్నించారు. ఇందుకు న్యాయవాది హుస్సేన్‌ సమాధానమిస్తూ రానున్న ఛార్జిషీటులో ఆ పార్టీ పేరును ప్రస్తావిస్తామని తెలిపారు. కాగా, సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.

Updated Date - May 15 , 2024 | 06:22 AM

Advertising
Advertising