Election Commission: వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటు.. ఈసీ కీలక నిర్ణయం..
ABN, Publish Date - Mar 02 , 2024 | 08:12 AM
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం - ఈసీ ( Election Commission ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజకీయ పార్టీలనకు కొన్ని సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. ఓట్ల ప్రచారం సమయంలో వ్యవహరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం - ఈసీ ( Election Commission ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజకీయ పార్టీలనకు కొన్ని సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. ఓట్ల ప్రచారం సమయంలో వ్యవహరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉపయోగించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఓటర్లను కులం, మతం, భాష పేరుతో ఓట్లు అడగవద్దని తెలిపింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు నియమావళిని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రచారం సమయంలో పార్టీలు మర్యాదగా వ్యవహరించాలని ఈసీ సూచించింది. వాస్తవాలకు విరుద్ధంగా ప్రకటనలు చేయవద్దంది. ఓటర్లను మభ్య పెట్టే పనులు చేయకూడదని పేర్కొంది. మత ప్రార్థనా సంస్థలైన మందిరాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించొద్దని ఆదేశించింది. ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. మహిళల గౌరవానికి, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు, చర్యలకు దూరంగా ఉండాలని వివరించింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టవద్దని స్పష్టం చేసింది.
మరోవైపు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఓటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 80 ఏళ్ల అర్హతను కేంద్రం 85 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ఎన్నికల రూల్స్ 1961లోని రూల్ 27ఎ క్లాజ్ (ఇ)ని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2024 | 08:12 AM