ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: వీడసలు మనిషేనా.. రోగికి ఇంజెక్షన్.. ఐసీయూలోనే అత్యాచారం..

ABN, Publish Date - Feb 27 , 2024 | 07:19 PM

అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన యువతిపై ఐసీయూలోనే అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల యువతి అడ్మిన్ అయింది.

అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన యువతిపై ఐసీయూలోనే అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల యువతి అడ్మిన్ అయింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమెను పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్కడే ఉన్న ఓ స్టాఫ్ బాయ్ ఆమెను పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున 4 గంటలకు ఎవరూ లేని సమయంలో నర్సింగ్ సిబ్బంది చిరాగ్ యాదవ్ దారుణానికి పాల్పడ్డాడు. బాధిత మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశాడు. ఆ సమయంలో సీసీ కెమెరాలను కర్టెన్లతో కప్పివేయడం గమనార్హం.

సోమవారం సాయంత్రం చికిత్స కోసం ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది. ఐసీయూలో ఉన్న సమయంలో ఆమెపై నర్సింగ్ స్టాఫ్ బాయ్‌ అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. దీనిని సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేశాం. నిందితుడు ఐసీయూ వార్డులో కర్టెన్లు వేయడం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యత వహించాలంటూ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. వారికి సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి ఆస్పత్రి మేనేజ్మెంట్ నిరాకరించడంతో బాధితులు ఫైర్ అయ్యారు. వెంటనే ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. తమను చంపేస్తామని ఆస్పత్రి సిబ్బంది నుంచి బెదిరింపులు వస్తున్నాయని నిరసనకారులు చెప్పడం కొసమెరుపు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 07:36 PM

Advertising
Advertising