CAA: అది మా అంతర్గత వ్యవహారం.. మీ జోక్యం వద్దు.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై..
ABN, Publish Date - Mar 15 , 2024 | 05:41 PM
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. సీఏఏ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందుతున్నామని మార్చి 11న అమెరికా ( America ) విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. సీఏఏ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందుతున్నామని మార్చి 11న అమెరికా ( America ) విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ చట్టం అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, మతపరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలు చట్టం ప్రకారం సమానమేనని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం ఇది తమ దేశ అంతరంగిక వ్యవహారం అని జోక్యం చేసుకోవద్దని సూచించింది.
అమెరికా ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. పౌరసత్వ (సవరణ) చట్టం 2019 భారతదేశ అంతర్గత విషయమని అన్నారు. సీఏఏ పై అమెరికా చేసిన వ్యాఖ్యలు అవగాహన లేనివి అని ఘాటు రిప్లై అచిచారు. డిసెంబర్ 31, 2014 న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో హింసకు గురైన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు ఈ చట్టం రక్షగా ఉంటుందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 15 , 2024 | 05:43 PM