ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National : నింగిలోకి అగ్నిబాణ్‌

ABN, Publish Date - May 31 , 2024 | 03:27 AM

నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్‌ కాస్మో్‌సకు చెందిన ప్రైవేటు రాకెట్‌ ‘అగ్నిబాణ్‌’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్‌ అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ అగ్నిబాణ్‌ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్‌ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.

ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయవంతం

చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు మార్గం సుగమం

సూళ్లూరుపేట, మే 30: నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్‌ కాస్మో్‌సకు చెందిన ప్రైవేటు రాకెట్‌ ‘అగ్నిబాణ్‌’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్‌ అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ అగ్నిబాణ్‌ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్‌ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు లాంచ్‌ ప్యాడ్‌ నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌ (సార్టెడ్‌) రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టారు.

భవిష్యత్‌లో సముద్ర మట్టానికి 700 కిలోమీటర్ల తక్కువ ఎత్తులోని కక్ష్యలోకి 300 కిలోలలోపు చిన్న తరహా ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి వీలుగా ఈ తరహా ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించిన రెండో సంస్థగా అగ్నికుల్‌ రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేటు సంస్థ 2022 నవంబరులో విక్రమ్‌-ఎస్‌ సబ్‌-ఆర్బిటాల్‌ రాకెట్‌ను ప్రయోగించింది.

వాస్తవానికి అగ్నిబాణ్‌ ప్రయోగం ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉంది. కానీ, నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చి.. ఐదోసారి విజయవంతమైంది. ‘శ్రీహరికోటలోని మా సొంత ప్రైవేటు ల్యాంచ్‌ప్యాడ్‌ నుంచి అగ్నిబాణ్‌ సార్టెడ్‌ మిషన్‌-01 విజయవంతంగా పూర్తయిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం’ అని అగ్నికుల్‌ ఎక్స్‌లో తెలిపింది. ఈ ప్రయోగం సందర్భంగా మిషన్‌ లక్ష్యాలన్నీ నెరవేరాయని ప్రకటించింది.

2025 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయోగం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. కాగా, ఈ విజయం స్వదేశీ డిజైన్‌, ఆవిష్కరణల పరాక్రమానికి నిదర్శనమని ఇస్రో చైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ అన్నారు. ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అగ్నికుల్‌ను ఆయన అభినందించారు.


  • ప్రయోగం రెండు నిమిషాలే..

అగ్నిబాణ్‌ దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌. ప్రపంచంలోనే తొలిసారిగా తయారు చేసిన సింగిల్‌ పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ ఇంజన్‌ను దీనిలో ఉపయోగించారు. దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్‌ పొడవు 6.2 మీటర్లు. దీని లోపల ఉపగ్రహం ఉంటుంది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను దీనిలో వినియోగించారు. ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాల పాటు సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. శ్రీహరికోటలోని ప్రైవేటు ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి రాకెట్‌ను ప్రయోగించిన నాలుగు సెకన్లలోనే ఇది నిర్ణీత దశకు మళ్లింది. 1.29 నిమిషాల సమయానికి ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి.. అక్కడి నుంచి సముద్రంలోకి పడిపోయింది. కాగా, ప్రపంచంలోనే తొలి సింగిల్‌ పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌తో నడిచే రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష రంగంలో కీలక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో కొనియాడారు.

Updated Date - May 31 , 2024 | 03:28 AM

Advertising
Advertising