Rahul Gandhi: నిరుద్యోగ సమస్యపై అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 09 , 2024 | 09:16 AM
భారత్, అమెరికాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని రాహుల్ గాంధీ అమెరికాలోని టెక్సాస్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు చైనా నిరుద్యోగాన్ని ఎలా గెలిచిందో కూడా వెల్లడించారు. ఈ క్రమంలో భారతదేశం, అమెరికా ఆ దిశగా ఆలోచించకపోతే నిరుద్యోగాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికా(america)లోని టెక్సాస్ యూనివర్సిటిలో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ సమస్య లేదని ప్రస్తావించారు. ఈ క్రమంలో చైనాలో నిరుద్యోగ సమస్య లేదు. వియత్నాంలో కూడా లేదన్నారు. ఈ క్రమంలో దీని వెనుక కారణాన్ని కూడా కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు. 40, 50, 60 దశకాలలో ప్రపంచ ఉత్పత్తికి అమెరికా కేంద్రంగా నిలిచిందన్నారు. తయారు చేసిన ఏదైనా కూడా ఇక్కడ తయారు చేయబడిందని గుర్తు చేశారు.
చైనా దాటేసింది
కారు, వాషింగ్ మెషీన్ లేదా టీవీ కావచ్చు ఇవన్నీ అమెరికాలో తయారయ్యేవి. కానీ ఇప్పుడు ఉత్పత్తి అమెరికా నుంచి మారిందన్నారు. అమెరికాలో తయారయ్యే వస్తువులు ఇప్పుడు కొరియా, జపాన్, చైనాలకు మారాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఉత్పత్తిలో చైనా(china) అందరినీ దాటేసి నిరుద్యోగాన్ని అధిగమించి దూసుకుపోతుందని రాహుల్ అన్నారు. కానీ పాశ్చాత్య, అమెరికా, యూరప్, భారత్‌లకు ఉత్పత్తి ఆలోచన ఉందని, అయితే వాటిని చైనాకు అప్పగించారని రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్పత్తి పనులు ఉపాధిని సృష్టిస్తాయని రాహుల్ స్పష్టం చేశారు.
ఆలోచించాలి
కానీ మనం ఏం చేస్తున్నాం. అమెరికా ఏం చేస్తుంది, పశ్చిమ దేశాలు ఏం చేస్తాయనేది ఆలోచించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రొడక్షన్ వర్క్ ఎలా నిర్వహించబడుతుందో భారతదేశం ఆలోచించాలని రాహుల్ సూచించారు. ఈ విషయాలపై భారత్ ఓకే అంటోంది, కానీ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఉత్పత్తి ఎలా జరుగుతుందో పునరాలోచించుకోవాలని ఆయన అన్నారు. అలా చేయని పక్షంలో నిరుద్యోగాన్ని(unemployment) అధిక స్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు.
తొలిసారి
తయారీ గురించి ఆలోచించడం మానేయడం వల్ల భారతదేశం, అమెరికా, యూరప్‌లలో పెద్ద ఎత్తున సామాజిక సమస్యలు ఏర్పడుతున్నాయని రాహుల్ తెలిపారు. ఈ కారణంగానే మన రాజకీయాలు పోలరైజేషన్ అవుతున్నాయని ఎంపీ రాహుల్ అన్నారు. మరోవైపు బంగ్లాదేశీయులకు కూడా రక్షణ కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగంతో పాటు మరెన్నో అంశాలపై రాహుల్ తన అభిప్రాయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం అమెరికా చేరుకున్నారు. సెప్టెంబర్ 10 వరకు ఆయన అమెరికా పర్యటనలో ఉంటారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
Viral Video: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read MoreNational News and Latest Telugu News
Updated Date - Sep 09 , 2024 | 09:19 AM