ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Akbar-Sita: సింహాలకు వివాదాస్పద పేర్లు.. అధికారి సస్పెండ్..

ABN, Publish Date - Feb 26 , 2024 | 11:05 AM

జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో ఓ ఉన్నతాధికారిని త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో ఓ ఉన్నతాధికారిని త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సింహాలకు అక్బర్, సీత అని పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. ఈ పేర్లు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వీహెచ్‌పీ కలకత్తా హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ తరుణంలో ఉన్నతాధికారి ప్రబిన్ లాల్ అగర్వాల్‌ను సస్పెండ్ చేస్తూ త్రిపుర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 12న సెపాహిజాలా జూ పార్క్ ఆడ మగ సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టింది. కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు అక్కడే ఉన్న సింహాలను పశ్చిమబెంగాల్ లోని సిలిగురికి తీసుకువచ్చారు. నార్త్ బెంగాల్ వైల్డ్ యానిమల్స్ పార్క్ అధికారులు వీటి పేర్లు మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

అక్బర్ భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాజు. ముస్లిం పాలకుడు. హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం సీత, రాముని భార్య. దీంతో చరిత్ర, ఇతిహాసంతో సంబంధం లేకుండా, మతంతో పని లేకుండా ఇలాంటి పేర్లు ఎలా పెడతారనే వివాదం మొదలైంది. చినికి చినికి గాలి వానలా మారి చివరకి సస్పెండ్ వరకు దారితీసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 11:05 AM

Advertising
Advertising