Sakshi Malik: రాజకీయాల్లోకి నన్నూ రమ్మన్నారు
ABN, Publish Date - Sep 06 , 2024 | 08:00 PM
ఒలింపియన్లు బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేసిన నేపథ్యంలో రాజకీయ రంగంలో అడుగుపెట్టే అవకాశాలపై సాక్షి మాలిక్‌ను మీడియా ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: రెజ్లింగ్‌లో మహిళలకు ఎదుర్కొంటున్న వేధింపులపై తాను జరుపుతున్న పోరాటం కొనసాగుతుందని ఒలంపిక్ మెడలిస్ట్ రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshi Malik) తెలిపారు. ఆ కారణంగానే రాజకీయాల్లోకి రమ్మంటూ తనకు పలు ఆఫర్లు వచ్చినప్పటికీ నిరాకరించినట్టు చెప్పారు. ఒలింపియన్లు బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేసిన నేపథ్యంలో రాజకీయ రంగంలో అడుగుపెట్టే అవకాశాలపై సాక్షి మాలిక్‌ను మీడియా ప్రశ్నించింది.
Congress: రైల్వే నుంచి ఫోగట్‌కు షోకాజ్.. కాంగ్రెస్ సంచలన అభియోగం
''పార్టీలో చేరాలనేది పునియా, ఫోగట్‌ల వ్యక్తిగత నిర్ణయం. నా వరకూ నేను మహిళల కోసం మొదలు పెట్టిన పోరాటం చివరివరకూ కొనసాగిస్తాను. ఫెడరేషన్‌ను ప్రక్షాళించి, మహిళలపై జరుగుతున్న అమానుషాలకు తెరపడేంత వరకూ నా పోరాడం ఆగదు. నా పోరాటంలో న్యాయం ఉంది, పోరాటం కొనసాగుతుంది'' అని సాక్షి మాలిక్ తెలిపారు. తన పోరాటం ఒక్క బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పైనేనని తెలిపారు. రాజకీయాలకు తాను అతీతంగా ఉండదలచుకున్నానని, రైల్వేలో పని చేస్తున్నానని చెప్పారు. తన పోరాటం కేవలం బ్రిజ్ భూషణ్ పైనేని, తనకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేనందున ఎన్నికల (పంజాబ్) ప్రచారంలో కూడా పాల్గొనేది లేదని తెగేసి చెప్పారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 2023లో సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫోగట్ పోరాటం సాగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..
Updated Date - Sep 06 , 2024 | 08:04 PM