ED Team: ఈ రోజు గాయపడ్డారు..రేపు చనిపోవచ్చు.. టీఎంసీపై కస్సుమన్న కాంగ్రెస్
ABN, Publish Date - Jan 05 , 2024 | 03:53 PM
ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది.
ముర్షిదాబాద్: ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దాడిని కాంగ్రెస్ (Congress) పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులపై దాడి జరగడం ఏమి ఆశ్చర్యానికి గురిచేయలేదని అభిప్రాయపడింది. ‘ఈ రోజు అధికారులపై దాడి జరిగింది.. రేపు చనిపోయినా పోవచ్చు, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు’ అని లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chaudhry) విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిలో టీఎంసీ కూడా ఉంది. అయినప్పటికీ బెంగాల్‌లో జరిగిన దాడిని అధిర్ రంజన్ (Adhir Ranjan) ఖండించారు.
అధిర్ కామెంట్లను టీఎంసీ నేత కునాల్ ఘోష్ (Kunal Ghosh) తోసిపుచ్చారు. అతను బీజేపీ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారని విమర్శించారు. బెంగాల్‌లో (Bengal) రేషన్ స్కామ్‌కు (Ration Scam) సంబంధించి టీఎంసీ నేతల ఇంటిపై దాడులు నిర్వహించేందుకు గురువారం రాత్రి ఈడీ అధికారులు బయల్దేరారు. ఉత్తర 24 పరగణ జిల్లాలో గల సందేశ్‌ఖాళి గ్రామానికి ఈడీ అధికారుల వాహనంపై దాడి చేశారు. ఆ దాడిలో పలువురు అధికారులు గాయపడ్డారు. ఆ ఘటనను అధిర్ రంజన్ చౌదరి తప్పుపట్టగా, టీఎంసీ కౌంటర్ ఇచ్చింది.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 05 , 2024 | 03:55 PM