ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Karnataka: చెప్పుకోవడానికి ఏంలేక గాంధీ కుటుంబాన్ని తిడుతున్నారు: మల్లికార్జున ఖర్గే

ABN, Publish Date - Apr 30 , 2024 | 04:48 AM

ప్రధాని మోదీకి చెప్పుకోవడానికి సొంతంగా సాధించిన విజయాలేమీ లేవు. అందుకనే గాంధీ కుటుంబాన్ని దుర్భాషలాడుతున్నారు.

గుర్‌మిట్కల్‌(కర్ణాటక), ఏప్రిల్‌ 29: ‘ప్రధాని మోదీకి చెప్పుకోవడానికి సొంతంగా సాధించిన విజయాలేమీ లేవు. అందుకనే గాంధీ కుటుంబాన్ని దుర్భాషలాడుతున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మొదటి రెండు దశల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. అది మోదీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘మోదీ పుట్టక ముందు, పుట్టిన తరువాత ఈ దేశంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. చెప్పుకోవడానికి తనకంటూ విజయాలేమీ లేకపోవడంతో ఆయన ఇప్పటికీ నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, రాహుల్‌, ప్రియాంకను దుర్భాషలాడుతున్నారు. మోదీలో నిరాశ, నిస్పృహ పెరిగిపోయాయి.


అందుకనే కాంగ్రెస్‌ ప్రజల ఆస్తులు లాక్కొని ముస్లింలకు పంచిపెడుతుందని ఆరోపిస్తున్నారు. అది రాజ్యాంగంలో కానీ, మా మేనిఫెస్టోలో కానీ ఎక్కడా లేదు. హిందూ, ముస్లిం ప్రస్థావన ఎప్పుడూ తీసుకొని రాలేదు. పేదల కోసం ఇందిర హ యాంలోనే భూ సంస్కరణలు తీసుకొచ్చాం. బ్యాంకులు, ఎల్‌ఐసీ జాతీయకరణ చేశాం. యూపీఏ పాలనలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. పేదలకు ఉపయుక్తమైన ఇలాంటి పనులేమైనా మోదీ చేశారా? దేశాన్ని బలోపేతం చేస్తామని మోదీ చెపుతున్నారు. మేం బలహీనపరుస్తామా! పాకిస్థాన్‌ను రెండుగా చీల్చిందే మేము. మీరేం చేశారు’ అని ఖర్గే అన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 04:49 AM

Advertising
Advertising