ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

EC: ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ఓటింగ్ పెరిగిందా.. ఈసీ వివరాలివే

ABN, Publish Date - Jun 08 , 2024 | 09:01 AM

2019 లోక్ సభ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల(Transgenders) ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్ కాగా 2024 ఎన్నికల్లో ఇది 25 శాతంగా ఉంది.

ఢిల్లీ: 2019 లోక్ సభ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల(Transgenders) ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్ కాగా 2024 ఎన్నికల్లో ఇది 25 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,87,803 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

ఏడు దశల లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈసీ.. దశల వారీగా డేటాను విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 19న జరిగిన ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌లో ట్రాన్స్ జెండర్‌ ఓటింగ్ 31.32 శాతం, ఏప్రిల్ 26న జరిగిన రెండో దశలో 23.86 శాతం, మే 7న జరిగిన మూడో దశలో 25.2 శాతం, మే 13న జరిగిన నాలుగో దశలో 34.23 శాతం, మే 20న జరిగిన ఐదో దశలో 21.96 శాతం, మే 25న జరిగిన ఆరో దశలో 18.67 శాతం పోలింగ్ నమోదైంది. జూన్ 1న జరిగిన చివరి దశ పోలింగ్‌లో 22.33 శాతం ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ 99 స్థానాల్లో నిలవగా, సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలను కైవసం చేసుకుంది.


మొత్తం ఓటింగ్ శాతం

2024 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం ఓటింగ్ శాతం 65.79గా నమోదైందని భారత ఎన్నికల సంఘం(EC) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాల్లో అస్సాంలో అత్యధికంగా 81.56 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్‌లో అత్యల్పంగా 56.19 పోలింగ్ నమోదైందని ఈసీ పేర్కొంది.

For Latest News and National News click here

Updated Date - Jun 08 , 2024 | 09:01 AM

Advertising
Advertising