ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెనడాలో హిందువుల భారీ ర్యాలీ

ABN, Publish Date - Nov 06 , 2024 | 04:01 AM

హిందూ ఆలయాలపై పదేపదే జరుగుతున్న దాడులకు నిరసనగా కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలోని హిందూ సభా మందిర్‌ దగ్గర వేలాది మంది హిందువులు సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు.

న్యూఢిల్లీ, నవంబరు 5: హిందూ ఆలయాలపై పదేపదే జరుగుతున్న దాడులకు నిరసనగా కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలోని హిందూ సభా మందిర్‌ దగ్గర వేలాది మంది హిందువులు సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ఖలిస్థానీ మద్దతుదారులు హిందూ సభ మందిర్‌పై, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న హిందువులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. కెనడా ప్రజా ప్రతినిధులు, దర్యాప్తు సంస్థలు ఖలిస్థానీలకు మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఇదిలా ఉండగా, కెనడాలో హిందూ ఆలయంపై దాడికి నిరసనగా ఢిల్లీలో యునైటెడ్‌ హిందూ ఫ్రంట్‌, రాష్ట్రవాదీ శివసేన మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కెనడాలో హిందూ దేవాలయాలపై ఇటీవల జరిగిన దాడులపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ రాజకీయాల్లో అతివాద శక్తులకు స్థానం ఇస్తున్నారనడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. ఇదిలా ఉండగా, భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి భారీ కుట్ర జరుగుతోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ కుట్రలో పాక్‌ ఐఎ్‌సఐతో పాటు కెనడాకూ భాగం ఉందని ఆరోపిస్తున్నాయి.

Updated Date - Nov 06 , 2024 | 04:01 AM