Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ABN, Publish Date - Nov 08 , 2024 | 10:16 PM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరక్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు సైతం లభ్యమయ్యానని తెలిపారు.
రాయ్‌పూర్, నవంబర్ 08: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. శుక్రవారం బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరకు బస్తర్ రేంజ్ ఐటీ సుందర్ రాజ్ శుక్రవారం రాయ్‌పూర్‌లో వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని రేఖపల్లి, కోమటిపల్లి మధ్య ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని తెలిపారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలోని ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తమకు సమాచారం అందిందని చెప్పారు.
Also Read: BJP: కొత్త అధ్యక్షుడి కోసం కమలనాధులు కసరత్తు.. త్వరలో ఢిల్లీలో కీలక బేటీ
Also Read: Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
Also Read: కమలా పండు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
దీంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కూబింగ్ చేపట్టాయని పేర్కొన్నారు. ఆ క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారన్నారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయన్నారు. అయితే ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న ప్రదేశంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతుల్లోని ఒకరు మాత్రం చాలా సీనియర్ మావోయిస్ట్ అని బస్తర్ రేంజ్ ఐటీ సుందర్ రాజ్ వివరించారు.
Viral News: అద్భుతం.. చంపి బొంద పెట్టినా లేచి వచ్చింది.. దీనివల్లే సాధ్యమైందట..
Uttar Pradesh : సమాజవాదీ పార్టీపై సీఎం యోగి విసుర్లు
Also Read: రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్.. అనంతరం కోర్టులో..?
మరోవైపు 2026, మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఆ క్రమంలో కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా మావోయిస్టులు లేకుండా పోయారు. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే మావోయిస్టులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సైతం మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.
For National News And Telugu News..
Updated Date - Nov 08 , 2024 | 10:16 PM