MK Stalin: కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పగ్గాలపై పెదవివిప్పిన స్టాలిన్
ABN, Publish Date - Aug 05 , 2024 | 09:40 PM
ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించనున్నారంటూ కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ఇప్పుడే ఉండకపోవచ్చునని జవాబిచ్చారు.
చెన్నై: ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin)కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించనున్నారంటూ కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తొలిసారి స్పందించారు. ఇప్పుడే ఉండకపోవచ్చునని జవాబిచ్చారు.
కొలతూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.8.45 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించిన సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగించాలని పార్టీ నుంచి డిమాండ్ పెరుగుతోందని, అయితే అందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు. స్టాలిన్ మంత్రివర్గంలో క్రీడలు, యువజన విభాగం మంత్రిగా, డీఎంకే యూత్ విభాగం సెక్రటరీగా ఉదయనిధి ఉన్నారు. ఆయనను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయనున్నారంటూ కొద్దికాలంగా మీడియాలో బలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉదయనిధి సైతం ఇటీవల స్పందిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో అందరూ డిప్యూటీ సీఎంలేనని అన్నారు. తనకు అన్ని పదవుల కంటే యూత్ విభాగం పదవే ఇష్టమని, ఏ పదవి ఇవ్వాలనే దానిపై నిర్ణయం సీఎందేనని వివరించారు.
Bangladesh Clashes: భారత్ - బంగ్లాల మధ్య రైళ్లు, విమానాల రద్దు.. పరిస్థితిని మోదీకి వివరించిన జైశంకర్
యూఎస్ పర్యటనకు ముందే..
కాగా, రాష్ట్రంలో పెట్టుబడులకు కోసం ఆగస్టు ద్వితీయార్థంలో స్టాలిన్ అమెరికా వెళ్లనున్నారని, ఆయన పరోక్షంలో బాధ్యతలను ఒకరికి అప్పగించాల్సి ఉంటుందని, అందుకోసం స్టాలిన్ తన పర్యటనకు ముందే డిప్యూటీ సీఎం పేరును అధికారికంగా ప్రకటించవచ్చని గత నెలరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
For Latest News and National News click here
Updated Date - Aug 05 , 2024 | 09:40 PM