National News: పిల్లల పెళ్లిల్లు ఎవరు చేస్తారు.. టాక్సీ డ్రైవర్ కుటుంబం ఆవేదన..
ABN, Publish Date - Jun 29 , 2024 | 03:43 PM
భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిపోవడంతో ఓ టాక్సీ డ్రైవర్ రమేష్ కుమార్ మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు. రమేష్‌పైనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. విమానశ్రయంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందడంతో..
భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిపోవడంతో ఓ టాక్సీ డ్రైవర్ రమేష్ కుమార్ మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు. రమేష్‌పైనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. విమానశ్రయంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందడంతో.. తమ పోషణ ఎలా అంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తండ్రి ఆసరాలేని తమ కుటుంబం ఎలా జీవనం గడపాలని మృతుడి కుమారుడు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన అందరిని కంటతడి పెట్టిస్తోంది. వయసుకు వచ్చిన పిల్లల పెళ్లిళ్లు చూడాలని తండ్రి.. తమ నాన్న సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ ఇద్దరు అమ్మాయిల ఆశ నెరవేరకుండానే రమేష్ కన్నుమూశారు. మరోవైపు ఇంటి పెద్దదిక్కు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తాము అనాథులయ్యామంటూ కుటుంబ సభ్యులంతా రోధిస్తున్నారు.
Parliament : నీట్‌పై దద్దరిల్లిన పార్లమెంటు
భారీ వర్షాలకు ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిపోవడంతో ఓ టాక్సీ డ్రైవర్ మృతి చెందాడు. కారుపు టెర్మినల్ పైకప్పు పడిన సమయంలో వాహనం లోపల డ్రైవర్ రమేష్ ఉన్నారు. ఆయను కారు లోపల నుంచి బయటకు తీసి టెర్మినల్ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే డ్రైవర్ రమేష్ మృతిచెందాడని వైద్యులు ధృవీకరించారు. 45 ఏళ్ల రమేష్ మరణంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఢిల్లీలోని రోహిణి సమీపంలోని విజయ్ విహార్‌లో నివాసముంటున్న రమేష్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబానికి ఏకైక జీవనాధారం రమేష్ సంపాదన. దీంతో తండ్రి ఆసరా లేకుంటే కుటుంబ పోషణ ఎలా అంటూ రమేష్ కుమారుడు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ప్రమాదం జరిగిన రోజు ఉదయం 8.30 గంటలకు తమకు కాల్ వచ్చిందని, విమానశ్రయంలో తన తండ్రి స్పృహతప్పి పడిపోయారని, ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారన్నారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు చెప్పలేదని రవీంద్ర తెలిపారు. తాము విమానాశ్రయానికి వెళ్లి ఏమి జరిగిందని పోలీసులను అడిగ్గా.. ఎటువంటి సమాధానం చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచారని, ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. అప్పటికే తమ తండ్రి చనిపోయినప్పటికీ విషయం చెప్పలేదని.. ఆసుపత్రిలో రెండు నుంచి మూడు గంటలు వేచిఉన్న తర్వాత తరువాటి రోజు వచ్చి పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లమని చెప్పారన్నారు.
కొద్దిరోజుల్లో పెళ్లి..
మృతుడు రమేష్‌కు ఇద్దరు కుమార్తెలు.. వారు పెళ్లి వయసుకు వచ్చారు. కొద్దిరోజుల్లో పెళ్లి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో కుటుంబంలో విషాదం నెలకొనడంతో పెళ్లి ఖర్చులు ఎలా భరించాలి.. తమకు ఆధారం ఎవరంటూ రమేష్ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం చెల్లించాలని రమేష్ కుటుంబం కోరుతోంది.
Ajith category MLAs : అజిత్ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పవార్ గూటికి?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News
Updated Date - Jul 01 , 2024 | 01:56 PM