ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indians: అమెరికాలో విషాదం.. నీటిలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

ABN, Publish Date - May 12 , 2024 | 10:54 AM

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

న్యూయార్క్: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా విశ్వవిద్యాలయంలో(Arizona university) రాకేష్ రెడ్డి లక్కిరెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) మాస్టర్స్ డిగ్రీలు పొందారు.

మే 8వ తేదీన వీరు తమ స్నేహితులతో కలిసి ఆరిజోనాలోని ఫాజిల్‌ క్రీక్‌ జలపాతం వద్దకు వెళ్లారు. జలాశయంలోకి దిగగానే ఇరువురు ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగిపోయారు.


స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. గజఈతగాళ్ల సాయంతో జలపాతం వద్ద గాలించినా వారి ఆచూకీ లభించలేదు. మరుసటిరోజు ఓ చోట ఇద్దరి మృతదేహాలు లభించాయి. మృతులు ఇద్దరు తెలుగు వారే కావడం వారి కుటుంబాలో తీరని విషాదాన్ని నింపుతోంది.

ఖమ్మం పట్టణానికి చెందిన రాకేశ్ రెడ్డి.. తెలంగాణలోని నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన చంద్రశేఖర్ రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు. రాకేశ్ కంప్యూటర్ సైన్స్ విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లారు. ఐటీ రంగంలో ఎంఎస్ పూర్తి చేసిన రోహిత్ మణికంఠ వివరాలు తెలియాల్సి ఉంది. వీరి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Latest News and National News here..

Updated Date - May 12 , 2024 | 10:54 AM

Advertising
Advertising