Trains: ప్రత్యేక వారాంతపు రైళ్ల సేవల పొడిగింపు
ABN, Publish Date - Jul 02 , 2024 | 12:34 PM
ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక వారాంతపు రైలు సేవలు పొడిగిస్తూ దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది. - నెం.07695 సికింద్రాబాద్-రామనాథపురం(Secunderabad-Ramanathapuram) ప్రత్యేక వారాంతపు రైలు (గురువారం) సేవలు ఈ నెల 3 నుంచి 17వ తేది (మూడు సర్వీసులు) పొడిగించారు. అలాగే, నెం.07696 రామనాథపురం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (శుక్రవారం) సేవలు ఈ నెల 5నుంచి 19వ తేది (మూడు సర్వీసులు) పొడిగించారు.
చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక వారాంతపు రైలు సేవలు పొడిగిస్తూ దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది.
- నెం.07695 సికింద్రాబాద్-రామనాథపురం(Secunderabad-Ramanathapuram) ప్రత్యేక వారాంతపు రైలు (గురువారం) సేవలు ఈ నెల 3 నుంచి 17వ తేది (మూడు సర్వీసులు) పొడిగించారు. అలాగే, నెం.07696 రామనాథపురం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (శుక్రవారం) సేవలు ఈ నెల 5నుంచి 19వ తేది (మూడు సర్వీసులు) పొడిగించారు.
- నెం.07191 కాచిగూడ-మదురై వారాంతపు ప్రత్యేక రైలు (సోమవారం) సేవలు ఈ నెల 1 నుంచి సెప్టెంబరు 30వ తేది (14 సర్వీసులు) వరకు పొడిగించారు. అలాగే, నెం.07192 మదురై-కాచిగూడ వారాంతపు ప్రత్యేక రైలు (గురువారం) ఈ నెల 3 నుంచి అక్టోబరు 2వ తేది (14 సర్వీసులు) పొడిగించారు.
ఇదికూడా చదవండి: Chennai: ‘స్పేస్ బే’గా 4 జిల్లాలు.. పదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాలు
- నెం.07189 హజూర్ సాహిబ్ నాందేడ్-ఈరోడ్ వారాంతపు ప్రత్యేక రైలు (శుక్రవారం) ఈ నెల 5 నుంచి సెప్టెంబరు 27వ తేది (13 సర్వీసులు) పొడిగించారు. అలాగే, నెం.07190 ఈరోడ్-హుజూర్ సాహిబ్ నాందేడ్ వారాంతపు ప్రత్యేక రైలు (ఆదివారం) సేవలు ఈ నెల 7 నుంచి సెప్టెంబరు 29వ తేది (13 సర్వీసులు) పొడిగించారు.
- నెం.07435 కాచిగూడ-నాగర్‌కోయిల్ వారాంతపు ప్రత్యేక రైలు (శుక్రవారం) సేవలు ఈ నెల 5 నుంచి సెప్టెంబరు 27వ తేది (13 సర్వీసులు) పొడిగించారు. అలాగే, నెం.07436 నాగర్‌కోయిల్-కాచిగూడ వారాంతపు ప్రత్యేక రైలు (ఆదివారం) సేవలు ఈ నెల 7 నుంచి సెప్టెంబరు 29వ తేది (13 సర్వీసులు) పొడిగించారు.
- నెం.07153 నరసాపూర్- బెంగుళూరు వారాంతపు ప్రత్యేక రైలు (కాట్పాడి, జోలార్‌పేట) (శుక్రవారం) సేవలు ఈ నెల 5 నుంచి ఆగస్టు 9వ తేది (6 సర్వీసులు) పొడిగించారు. అలాగే, నెం.07154 బెంగళూరు-నరసాపూర్ వారాంతపు ప్రత్యేక రైలు (శనివారం) సేవలు ఈ నెల 5 నుంచి ఆగస్టు 10వ తేది (6 సర్వీసులు) పొడిగించారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 02 , 2024 | 12:34 PM