ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:44 AM

విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు.

చెన్నై: విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. అక్టోబరు 27న మహానాడు జరిగే సమయానికి ఆ పార్టీలో సుమారు 75 లక్షలకు పైగా సభ్యత్వాలున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: చెన్నైలో తెలుగు భవనం


మహానాడు ఏర్పాట్ల కారణంగా సభ్యత్వ నమోదును కొన్ని రోజులపాటు ఆపారు. మహానాడు ముగిసిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించగా ఆ పార్టీ నేతలు కూడా ఊహించని విధంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఒకే సమయంలో లక్షలాది మంది ఆన్‌లైన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయడంతో పార్టీ యాప్‌ సర్వర్‌ స్తంభించింది.


ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో(Software engineers) సర్వర్‌ చక్కదిద్దటంతో మళ్ళీ సభ్యత్వ ముమ్మర కార్యక్రమం ఊపందుకుంది. శుక్రవారం మధ్యాహ్నానికి టీవీకే సభ్యత్వాలు కోటికి చేరాయి. ఈ విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.


ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌ ఓ రాబందు..

ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2024 | 11:44 AM