ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి

ABN, Publish Date - Aug 24 , 2024 | 10:24 AM

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే నిందితుడు సంజయ్ రాయ్ తల్లి తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇంకా ఏం చెప్పారనే వివరాలను ఇక్కడ చుద్దాం.

kolkata trainee doctor murder case accused mother

కోల్‌కతా(kolkata)లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసులో(kolkata trainee doctor murder case) ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(sanjoy roy) గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి(mother) తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. తన కొడుకు తనను మంచిగా చూసుకున్నాడని ఆమె చెప్పింది. మీరు మా కొడుకు సంజయ్ గురించి ఇరుగుపొరుగు వారందరినీ కూడా అడగవచ్చని. తాను ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపింది. అంతేకాదు డాక్టర్ తన కొడుకుతో మరింత కఠినంగా ఉంటే, ఇవన్నీ జరిగేవి కావని తెలిపింది. నా భర్త మరణంతో అంతా తప్పు జరిగింది. నా అందమైన కుటుంబం ఇప్పుడు జ్ఞాపకం మాత్రమేనని వాపోయింది.


ఘటనా స్థలంలో

అతను ఆర్జీ ఆసుపత్రికి వెళ్లేవాడని నాకు తెలియదని నిందితుడి తల్లి(mother) చెప్పింది. తన కొడుకు RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సివిక్ వాలంటీర్‌గా నియమించబడ్డాడని కూడా తెలియదని ఆమె వెల్లడించింది. ఆగస్టు 9న 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్ సెమీ న్యూడ్ బాడీ కనిపించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరుసటి రోజు రాయ్‌ని అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో అతని బ్లూటూత్ హెడ్‌సెట్ కూడా లభ్యమైంది. అయితే అతన్ని ఎవరు ప్రభావితం చేశారో నాకు తెలియదు.

కానీ ఎవరైనా నా కొడుకును ఇరికించి ఉంటే ఆ వ్యక్తిని శిక్షించాలని నిందితుడి తల్లి కోరింది. సంజయ్ రాయ్‌కు క్రీడలంటే చాలా ఆసక్తి, అతను బాక్సింగ్ నేర్చుకునేవాడు. అతను ఎన్‌సీసీలో భాగమైన క్రమంలో పాఠశాల క్రీడల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే నిజంగా అతన్ని ఎవరైనా ప్రభావితం చేశారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.


ఇంకెన్ని రోజులు

మరోవైపు ఈ అత్యాచారం, హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ దర్యాప్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు దర్యాప్తు ఆలస్యం అవుతున్న క్రమంలో సహనం కోల్పోతున్నట్లు చెప్పారు. ఘటన జరిగి 14 రోజులైనా కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందన్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడికి సీల్దా కోర్టు శుక్రవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పర్యవేక్షణలో సెప్టెంబర్ 6 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.


ఇవి కూడా చదవండి:

Maternity Leaves: ఈ మహిళలకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులు.. సీఎం కీలక ప్రకటన


Health Department : స్నాతకోత్సవాల కోసం భారతీయ దుస్తులు


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 10:26 AM

Advertising
Advertising
<