Pune Airport: నకిలీ విమాన టికెట్లతో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ABN , Publish Date - Aug 12 , 2024 | 05:26 PM
సలీం గోలేఖాన్, నసీరుద్దీన్ ఖాన్‌గా వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు వ్యక్తులు నకిలీ టికెట్లతో పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారన్నారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అప్రమత్తమై భద్రత సిబ్బంది... వారిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
పుణె, ఆగస్ట్ 12: నకిలీ విమాన టికెట్లతో లఖ్‌నవూకు వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పుణె ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సలీం గోలేఖాన్, నసీరుద్దీన్ ఖాన్‌గా వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు వ్యక్తులు నకిలీ టికెట్లతో పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారన్నారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అప్రమత్తమై భద్రత సిబ్బంది... వారిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
Also Read: Independence Day: వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ..
గత నెల 30వ తేదీన..
జులై 30వ తేదీన సైతం ఇదే తరహా ఘటన చోటు చేసుకుందని ఎయిర్‌పోర్ట్ పోలీసులు వెల్లడించారు. నకిలీ విమాన టికెట్‌ను ఉపయోగించి ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతడిని విచారించగా ఆసక్తికర అంశాన్ని వెల్లడించారన్నారు. మహిళా బంధువులు సౌదీ అరేబియాలోని జెడ్డాకు ప్రయాణిస్తున్నారని.. వారికి చెక్ - ఇన్ ప్రక్రియ సజావుగా సాగడం కోసం.. ముంబయి - నాగ్‌పూర్ విమానానికి సంబంధించిన నకిలీ టికెట్ తయారు చేసుకున్నట్లు వివరించాడని చెప్పారు. సదరు ప్రయాణికుడు బీవండికి చెందిన యుస్మా మహమ్మద్ అన్వర్ మొమిన్‌గా ఎయిర్‌పోర్ట్ భద్రత సిబ్బంది గుర్తించి.. అతడిని సహార్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా
మధురై ఎయిర్‌పోర్ట్‌లో..
అలాగే గత జులైలోనే బెంగళూరు మీదగా అయోధ్య వెళ్లేందుకు దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులు మధురై ఎయిరోపోర్ట్‌కు చేరుకున్నారు. వారి వద్ద ఉన్నవి నకిలీ విమాన టికెట్లని ఎయిర్‌పోర్ట్ భద్రత సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని ఆ ప్రయాణికులకు స్పష్టం చేశారు. ఆ క్రమంలో ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో.. కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది నకిలీ విమాన టికెట్ల కుంభకోణమని వారికి వివరించడంతో.. ఆ ప్రయాణికులు చేసేది లేక వెనుతిరిగి వెళ్లిపోయారని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read More National News and Latest Telugu News