ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Encounter: కథువా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABN, Publish Date - Sep 11 , 2024 | 06:42 PM

కథువా-బసంత్‌గఢ్ సరిహ్దదు ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని డిఫెన్స్ పబ్లిక్స్ రిలేషన్స్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ పౌరులుగా గుర్తించామని చెప్పారు.

ఉదంపూర్: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతున్నట్టు 'రైజింగ్ స్టార్ కార్ప్స్' సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

BJP: రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్


నిర్దిష్టమైన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని, కథువా-బసంత్‌గఢ్ సరిహ్దదు ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని డిఫెన్స్ పబ్లిక్స్ రిలేషన్స్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ పౌరులుగా గుర్తించామని, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటిలో మోడ్రన్ రైఫిల్స్, గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టు తెలిపారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఈనెల 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరుపుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ భద్రతా బలగాలు అప్రమత్తమవుతూ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.


ForLatest NewsandNational Newsclick here

Updated Date - Sep 11 , 2024 | 06:42 PM

Advertising
Advertising