Chennai: బంగాళాఖాతంలో తుఫాన్.. 5 రోజుల వర్షసూచన
ABN, Publish Date - Oct 23 , 2024 | 11:06 AM
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌కు చేరువగా సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడి తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 9 ఓడరేవుల్లో ఒకటో నెంబర్ సూచిక ఎగురవేశారు.
- 9 ఓడరేవుల్లో ఒకటో నెంబర్ సూచిక
- రాష్ట్రానికి 5 రోజుల వర్షసూచన
చెన్నై: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌కు చేరువగా సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడి తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 9 ఓడరేవుల్లో ఒకటో నెంబర్ సూచిక ఎగురవేశారు. గత ఆదివారం ఉత్తర అండమాన్(North Andaman) సముద్రానికి చేరువగా ఏర్పడిన అల్పపీడనం, సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తీవ్రంగా మారింది. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం మధ్య తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బుధవారం తుఫానుగా మారే అవకాశం ఉంది.
ఈ వార్తను కూడా చదవండి: వయనాడ్‌లో ప్రియాంకతో నవ్య ఢీ
ఆ తుఫాన్ వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయం వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా - పశ్చిమబెంగాల్(Odisha - West Bengal) మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం కారణంగా మద్రాసు ఓడరేవు, ఎన్నూరు, కాట్టుపల్లి, కారైక్కాల్, తూత్తుకుడి, కడలూరు, నాగపట్టినం, పాంబన్ ఓడరేవుల్లో ఒకటో నెంబర్ తుఫాను సూచిక ఎగురవేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో రెండు రోజులపాటు తూర్పు బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం, మధ్య పశ్చిమ బెంగాల్ సముద్రం, ఆంధ్రా సముద్రతీరాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కాగా బుధవారం ఏర్పడనున్న తుఫాన్‌కు ఖతార్ దేశం ఇదివరకే ‘డానా’ అనే పేరు పెట్టిన విషయం విధితమే.
వర్ష సూచన..
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఐదు రోజుల పాటు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోను, పుదుచ్చేరి, కారైక్కుడి ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తంజావూరు, పుదుకోట, శివగంగ(Thanjavur, Pudukota, Sivaganga), మదురై, తేని, దిండుగల్ జిల్లాల్లో బుధవారం పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
నగరంలో మేఘావృతం...
నగరానికి సంబంధించినంత వరకు పలు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సముద్రతీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. బుధవారం నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందన్నారు.
ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!
ఇదికూడా చదవండి: KTR : రేవంత్ చెప్పేవి పచ్చి అబద్ధాలు!
ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్ 1912
ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రాణహని!
Read Latest Telangana News and National News
Updated Date - Oct 23 , 2024 | 11:06 AM