I.N.D.I.A. alliance meet: 'ఇండియా' కూటమి సమావేశానికి ఉద్ధవ్ దూరం..
ABN, Publish Date - Jun 05 , 2024 | 04:42 PM
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించేందుకు 'ఇండియా' కూటమి బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే హాజరు కావడం లేదు.
ముంబై: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించేందుకు 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) హాజరు కావడం లేదు. తొలుత 'ఇండియా' కూటమి సమావేశానికి హాజరకావాలని థాకరే అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన తరఫున సీనియర్ నేత సంజయ్ రౌత్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ప్రతినిధుల బృందం హాజరవుతుందని పార్టీ వర్గాల సమాచారం.
NDA Vs INDIA: ఒకే విమానంలో నితీష్, తేజస్వి.. ప్రయాణం తర్వాత సీన్ ఇదీ.
కారణం ఏమిటి?
'ఇండియా' కూటమి సమావేశానికి ఉద్ధవ్ దూరంగా ఉండటానికి కారణం ఏమిటనేది ఇంతవరకూ తెలియనప్పటికీ, భవిష్యత్తులో కూటమి ఏర్పాటు చేసే సమావేశాలకు ఉద్ధవ్ తప్పనిసరిగా హాజరవుతారంటూ ఈ పార్టీ వర్గాలు తెలిపాయి. అత్యవసరమైతే మాత్రం ఉద్ధవ్ వెంటనే ఢిల్లీకి వెళ్తారని కూడా ఆ వర్గాలు వివరణ ఇచ్చాయి. కాగా, డీఎంకే సుప్రీం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఇతర పలువురు ప్రముఖ నేతలు 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గోనున్నారు.
For Latest News and National News Click Here
Updated Date - Jun 05 , 2024 | 04:47 PM