Udayanidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి, మంత్రులుగా మరో నలుగురు
ABN, Publish Date - Sep 29 , 2024 | 07:08 PM
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరితో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చెన్నైలోని రాజ్‌భవన్‌లో ఆదివారంనాడు ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా హాజరయ్యారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఇటీవల మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై విడుదలైన వి.సెంథిల్ బాలాజీతో పాటు ఆర్.రాజేంద్రన్ (సేలం-నార్త్) గోవి చెళియన్ (తిరవిడైమరుదూరు), ఎస్.ఎం నాజర్ (అవడి) ఉన్నారు.
Jammu and Kashmir Assembly Elections: అలా చేసుంటే.. పాక్‌కు పెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్ సింగ్
కాగా, సెంథిల్‌కు విద్యుత్, ఎక్సైజ్ శాఖలను కేటాయించగా, గోవి చెళియన్‌కు సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా హైయర్ ఎడ్యుకేషన్ శాఖను కేటాయించారు. నాజర్‌కు మైనారిటీ వ్యవహారాలు,ఆర్.రాజేంద్రన్‌కు పర్యాటక శాఖను ప్రభుత్వం కేటాయించినట్టు రాజ్‌భవన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నారు. ప్లానింగ్ అండ్ డవపల్‌మెంట్ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు.
For National News And Telugu News..
ఇది కూడా చదవండి...
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
Updated Date - Sep 29 , 2024 | 07:08 PM