ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Budget : మాల్దీవులకు ‘సాయం’లో కోత

ABN, Publish Date - Jul 25 , 2024 | 05:38 AM

కేంద్ర బడ్జెట్‌ 2024-25లో మాల్దీవులకు మోదీ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’ విధానం కింద అభివృద్ధి సాయం నిధుల్లో భూటాన్‌కు రూ.2,068 కోట్ల అత్యధిక వాటా కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.770.9 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని రూ.400 కోట్లకు పరిమితం చేసింది. ఈ కేటాయింపు

గతంలో రూ.770 కోట్లు.. ఇప్పుడు రూ.400 కోట్లే

న్యూఢిల్లీ, జూలై 24: కేంద్ర బడ్జెట్‌ 2024-25లో మాల్దీవులకు మోదీ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’ విధానం కింద అభివృద్ధి సాయం నిధుల్లో భూటాన్‌కు రూ.2,068 కోట్ల అత్యధిక వాటా కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.770.9 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని రూ.400 కోట్లకు పరిమితం చేసింది. ఈ కేటాయింపు చేయడం ద్వారా గ్రేటర్‌ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులకు ఆ దేశంతో ఉన్న ఉద్రిక్తతలను కేంద్రం అడ్డంకిగా మారనివ్వలేదు. అలాగే మాల్దీవులకు కేటాయింపులన్నీ రుణంగా కాకుండా గ్రాంటు రూపంలో ఇచ్చింది. చైనా అనుకూలుడుగా ముద్రపడిన మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. భూటాన్‌ తర్వాత అత్యధికంగా నేపాల్‌కు రూ.700 కోట్లు కేటాయించారు. మారిష్‌సకు రూ.370 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు, శ్రీలంకకు రూ.245 కోట్లు చొప్పున కేంద్రం బడ్జెట్‌లో అభివృద్ధి సాయం ప్రకటించింది. ఇరాన్‌లో చాబహార్‌ పోర్టు నిర్వహణకు రూ.100కోట్లు మంజూరు చేసింది. తాజా బడ్జెట్‌లో విదేశాలకు అభివృద్ధి సాయం కింద భారత్‌ మొత్తం రూ.4,883.56 కోట్లు కేటాయించింది.

Updated Date - Jul 25 , 2024 | 05:38 AM

Advertising
Advertising
<