ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Encounter: అమిత్ షా వార్నింగ్.. పక్షం రోజుల్లోనే..

ABN, Publish Date - Oct 04 , 2024 | 08:55 PM

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి ఎర్రబారింది. శుక్రవారం నారాయణపూర్- దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది. దాంతో మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మరోసారి స్పష్టమైంది.

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి ఎర్రబారింది. శుక్రవారం నారాయణపూర్- దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది. దాంతో మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మరోసారి స్పష్టమైంది. 2025, మార్చిలోగా దేశంలో మావోయిజాన్ని అంతమొందిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రకటన చేశారు.

GHMC: కమిషనరమ్మ.. తాళం వైపు చూడమ్మ


ఆ క్రమంలో ఆయుధాలు వీడి లొంగిపోవాలని మావోయిస్లులకు పిలుపు నిచ్చారు. లేకుంటే వారిని సమూలంగా నిర్మిలిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటన చేసిన పక్షం రోజుల్లోనే ఛత్తీస్‌గఢ్‌లో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్ మూడో వారంలో న్యూఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించి.. శాంతి సుస్థిరతలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని తెలిపారు. అందులో భాగంగా నేపాల్‌లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వరకు మావోయిస్టులు కారిడార్ ఏర్పాటు చేసేందుకు జరిగిన ప్రయత్నాలను ప్రధాని మోదీ ధ్వంసం చేశారని ఆయన గుర్తు చేశారు.

Dasara Navaratri 2024: నవరాత్రులు మూడో రోజు.. విశేషమేమంటే..


మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌‌లో కొన్ని జిల్లాలలకే వారు పరిమితమయ్యారన్నారు. త్వరలో ఈ జిల్లాల్లో సైతం మావోయిస్టులను నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది. అలాంటి వేళ.. హోం మంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నెల రోజుల పాటు వార్షికోత్సవాలు జరుగుతున్న వేళ.. మావోయిస్టులు బృందాలుగా ఏర్పడే అవకాశాలున్నాయని నిఘా సంస్థలు ముందస్తుగా గుర్తించాయని తెలుస్తుంది. దేశంలోని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంటుదన్న సంగతి అందరికీ తెలిసిందే. వారి ఏరివేతకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Dussehra 2024: ఇంతకీ దసరా ఎప్పుడు.. అక్టోబర్ 12 లేదా 13 ? పండగ ఏ రోజు జరుపుకోవాలి..?


అందులోభాగంగా ఛత్తీస్‌గఢ్‌కు ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద భారీగా భద్రత దళాలను మోహరించింది. అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా దళాలను రంగంలోకి దింపింది. ఇక మావోయిస్టుల నిర్మూలనకు మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను తీసుకు వచ్చింది. అందులోభాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 160 మందికిపైగా మావోయిస్టులను భద్రతా దళాలు తుదిముట్టించిన విషయం విధితమే.

For National News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 09:10 PM