Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కట్టిపడేసిన అందాలు
ABN, Publish Date - Nov 14 , 2024 | 09:41 PM
మేఘాలయలోని ప్రకృతి అందాలు తనను కట్టిపడేశాయని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజధాని షిల్లాంగ్‌లోని ఖాసీ గిరిజన నృత్యం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందన్నారు. వారసత్వం, పట్టుదలకు ఈ నృత్యం గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఖాసీ ప్రజల ఆతిథ్యం.. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటని ఆయన అభివర్ణించారు.
షిల్లాంగ్, నవంబర్ 14: భారతదేశంలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి అందాల గురించి చెప్పన్నక్కర్లేదు. అలాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కటి మేఘాలయా. ఆ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ వేదికగా హెలికాఫ్టర్, స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ 6వ శిఖరాగ్ర సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఆప్
Also Read: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్
Also Read: ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సదస్సులో మేఘాలయ సీఎం శ్రీ కాన్రాడ్ సంగ్మాతో కలిసి పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఉదాన్ పథకంలో భాగంగా ఉమియం సరస్సులో సీ ప్లేన్ డిమానిస్ట్రేషన్ ఫ్లైట్ ప్రారంభించామన్నారు. తద్వారా ఈశాన్య భారతాన్ని అనుంధానించండంలో కీలక ముందడుగు పడిందన్నారు.
ఈ శిఖరాగ్ర సదస్సు.. మారుమూల గ్రామాల్లోని ప్రజలు సైతం అత్యంత తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ రంగాన్ని సుస్థిరం చేయడానికి, ఈ పర్వత ప్రాంత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేసే కృషిని తెలియజేస్తుందని ఆయన వివరించారు.
Also Read: ఊపందుకున్న ప్రచారం.. ఈసీ సోదాలు
Also Read: క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే..
ఈ సదస్సు నేపథ్యంలో షిల్లాంగ్‌లో పర్యటన సందర్భంగా ఖాసీ వారసత్వ గ్రామం తాలుక అనుభూతిని అనుభవించే అద్భుతమైన అవకాశం తనకు లభించిందన్నారు. నిర్మలమైన అటవీ ప్రాంతంలో వెదురు, కలపతో నిర్మించిన నివాసాలు, ప్రకృతి సౌందర్యం, ఇక్కడి ప్రజల జీవన విధానం తనను మంత్రముగ్ధుడిని చేసిందని తెలిపారు.
Also Read: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన
Also Read: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
అలాగే ఈ ప్రకృతి అందాలు తనను కట్టిపడేశాయని చెప్పారు. ఇక ఖాసీ గిరిజన నృత్యం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందన్నారు. వారసత్వం, పట్టుదలకు ఈ నృత్యం గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఖాసీ ప్రజల ఆతిథ్యం..భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ఆకర్షణ అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లోని లోతైన సౌందర్యాన్ని ఈ పర్యటన తనకు గుర్తు చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వివరించారు.
For National News And Telugu News
Updated Date - Nov 14 , 2024 | 09:50 PM