ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:25 AM

ఇటీవల భారత్‌లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్‌ వచ్చాయి.

  • వారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా సవరణ

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌ వెల్లడి

  • వారంలో 100 బెదిరింపు కాల్స్‌

  • అవన్నీ ఫేక్‌ అని తేలినట్లు ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబరు 21: ఇటీవల భారత్‌లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో కాల్స్‌, సోషల్‌ మీడియాలో ఫేక్‌ పోస్టుల ద్వారా బెదిరింపులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. విమానయాన భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, బెదిరింపు కాల్స్‌ చేసే వారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా నిబంధనలు సవరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడటాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించి తగిన శిక్ష, జరిమానా విధిస్తామని తెలిపారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ వచ్చిన బెదిరింపు కాల్స్‌ అన్నీ ఫేక్‌ అని తేలిందని చెప్పారు. అయినప్పటికీ.. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్‌ ఉందని, దాన్నే తాము పాటిస్తున్నామని స్పష్టం చేశారు. విమానంలో బోర్డింగ్‌ పూర్తయ్యాక ఇలాంటి బెదిరింపు కాల్స్‌ చేసేవారికి శిక్ష విధించేలా ఇప్పటికే చట్టంలో కొన్ని సెక్షన్లు ఉన్నాయని, అయితే.. ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా వీటిని వర్తింపజేసే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్‌ వచ్చినప్పటి నుంచి అనేక విమానయాన సంస్థలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపారు. సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌ (ఎస్‌యూఏసీఎ్‌సఏ)ను సవరించే అంశంపైనా వివిధ శాఖలతో చరిస్తున్నామని చెప్పారు. విమానం గాలిలో ఉన్నప్పుడు ఫేక్‌ బెదిరింపు కాల్స్‌ చేసేవారికి ఎస్‌యూఏసీఎ్‌సఏ చట్టం ప్రకారం ప్రస్తుతం జీవిత ఖైదు విధిస్తున్నారు.


అయితే దీనితోపాటు వారిని నో ఫ్లై జాబితాలో చేర్చేందుకు నిబంధనలు సవరించే పనిలో ఉన్నామని మంత్రి తెలిపారు. ‘‘గతవారం రోజుల్లో పలు బెదిరింపు కాల్స్‌ రావడంతో ఎనిమిది విమానాలను దారి మళ్లించాం. ప్రతి అంశాన్నీ సమగ్రంగా విశ్లేషించి వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం. అవి ఫేక్‌ కాల్స్‌ అని తెలిసినా.. మేం తేలికగా తీసుకోలేదు. భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బెదిరింపు కాల్స్‌పై హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం. అందరి సమష్టి కృషితో త్వరలోనే మెరుగైన పరిస్థితి తీసుకొస్తాం’ అని రామ్మోహన్‌ నాయుడు వివరించారు.

  • హోంశాఖతో సమావేశం

విమానాశ్రయాల్లో భద్రతకు బాధ్యత వహించే ఏవియేషన్‌ సెక్యూరిటీ బాడీ బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ్‌సఎ్‌ఫ)తో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. బీసీఏఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ జుల్ఫికర్‌ హసన్‌, సీఐఎ్‌సఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజ్విందర్‌ సింగ్‌ భట్టి.. బెదిరింపు కాల్స్‌పై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలను హోంశాఖ ముఖ్యకార్యదర్శి గోవింద్‌ మోహన్‌కు వివరించారు.

Updated Date - Oct 22 , 2024 | 04:25 AM