ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవూ చేయకూడదు

ABN, Publish Date - Nov 17 , 2024 | 04:03 AM

‘నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవు కూడా జాబ్‌ చేయడానికి వీల్లేదు. చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసెయ్‌’ అంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన భర్తపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కఠినంగా వ్యవహరించింది.

భార్యపై భర్త ఒత్తిడి.. భార్యకు విడాకులిప్పించిన కోర్టు

భోపాల్‌, నవంబరు 16: ‘నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవు కూడా జాబ్‌ చేయడానికి వీల్లేదు. చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసెయ్‌’ అంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన భర్తపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కఠినంగా వ్యవహరించింది. ఇది క్రూరత్వం కిందికే వస్తుందని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది. ఓ జంటకు 2014లో వివాహం జరిగింది. ఇద్దరూ భోపాల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. 2017లో ఆ మహిళ (33 ఏళ్లు)కు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఏ ఉద్యోగం రాలేదు. దాంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి, భోపాల్‌ తిరిగి వచ్చి తనతో కలిసి ఉండాలంటూ ఒత్తిడి తెచ్చాడు. తనకు ఉద్యోగం వచ్చే దాకా ఆమె ఏ ఉద్యోగం చేయడానికి వీల్లేదని గట్టిగా చెప్పాడు. విసిగిపోయిన ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం దరఖాస్తు చేసింది. విడాకులు ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించడంతో హైకోర్టులో అప్పీలు చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం విడాకులు ఇప్పించింది.

Updated Date - Nov 17 , 2024 | 04:03 AM