Crime News: వేధింపులు, బాడీ షేమింగ్‌తో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య..
ABN, Publish Date - Jul 18 , 2024 | 11:33 AM
పని ప్రదేశాల్లో బాడీ షేమింగ్‌కి గురై ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఘజియాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జ్ఞానంజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న 27 ఏళ్ల శివాని త్యాగి అనే మహిళ పని ప్రదేశంలో ఆరు నెలలుగా తీవ్రమైన వేధింపులు, బాడీ షేమింగ్‌ని ఎదుర్కొంటోంది.
లఖ్‌నవూ: పని ప్రదేశాల్లో బాడీ షేమింగ్‌కి గురై ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఘజియాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జ్ఞానంజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న 27 ఏళ్ల శివాని త్యాగి అనే మహిళ పని ప్రదేశంలో ఆరు నెలలుగా తీవ్రమైన వేధింపులు, బాడీ షేమింగ్‌ని ఎదుర్కొంటోంది.
ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్ రాశారని.. దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సింగ్ వెల్లడించారు. సూసైడ్ లేఖలో ఐదుగురి పేర్లను రాసి, వారికి మరణశిక్ష విధించాలని కోరింది.ఈ వేధింపుల గురించి తొలుత శివాని తన కుటుంబసభ్యులకు చెప్పలేదు.
తరువాత వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక తన కష్టాలను కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె సోదరుడు గౌరవ్ శివానిని ఆఫీసులో ఎలా వేధించేవారో మీడియాతో తెలిపారు.
'ఆమె సహోద్యోగులు నా సోదరి డ్రెస్సింగ్ సెన్స్, ఆహార అలవాట్లపై అనవసర కామెంట్స్ చేసేవారు. తరచూ శివానిలా చేస్తున్నావేంటి అని అనేవారు. దీంతో నా సోదరి చాలా బాధపడేది. ఓ మహిళ శివానిపై దాడి చేయడానికి వచ్చింది. ఈ బాధలన్నీ భరించలేక శివాని రాజీనామా చేయాలని చాలా సార్లు అనుకుంది. కానీ కంపెనీ ఆమె రాజీనామాను ఆమోదించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్యోగం కొనసాగించింది. శివాని చాలాసార్లు చెప్పినా.. కంపెనీ ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదు'అని గౌరవ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
For Latest News and National News click here
Updated Date - Jul 18 , 2024 | 11:33 AM