ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి

ABN, Publish Date - Sep 02 , 2024 | 02:01 PM

నగదు బదిలీ కాస్తా ఆలస్యమయ్యే సరికి ఓ నిండి ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌‌ ప్రభుత్వారోగ్య శాఖ విభాగంలో ఆదిత్యవర్ధన్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సహచర ఉన్నతాధికారులతో కలిసి ఆయన కన్పూర్ సమీపంలోని నానామౌ ఘాట్‌లో స్నానం చేసేందుకు గంగానదిలో దిగారు.

లఖ్‌నవూ, ఆగస్ట్ 02: నగదు బదిలీ కాస్తా ఆలస్యమయ్యే సరికి ఓ నిండి ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌‌ ప్రభుత్వారోగ్య శాఖ విభాగంలో ఆదిత్యవర్ధన్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సహచర ఉన్నతాధికారులతో కలిసి ఆయన కన్పూర్ సమీపంలోని నానామౌ ఘాట్‌లో స్నానం చేసేందుకు గంగానదిలో దిగారు. ఆ క్రమంలో సహచరులతో కలిసి ఆదిత్య వర్ధన్ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అంతలో కాలు జారీ ఆయన నీటిలో పడి పోయారు. ఆయనను రక్షించాలంటూ అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్ కాశ్యప్‌ను వారు కోరారు.


తనకు రూ. 10 వేలు చెల్లిస్తే ఆయన్ని కాపాడతానని స్పష్టం చేశారు. ఆదిత్యవర్దన్ సహచరులు అతడికి ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లించారు. కానీ అతడి ఖాతాలో ఆ నగదు పడినట్లు కాశ్యప్ ఫోన్‌కు సందేశం రాలేదు. దీంతో తనకు నగదు చెల్లించినట్లు సందేశం వచ్చే వరకు ఆదిత్య వర్ధన్‌ను కాపాడనని గజ ఈతగాడు కరాఖండిగా చెప్పాడు.


అంతలో గంగా నదిలో వరద నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో ఉన్నతాధికారి ఆదిత్య వర్ధన్ నీటిలో పడి కొట్టుకు పోయాడు. ఇంతలో గజ ఈతగాడు సునీల్ కాశ్యప్ సెల్ ఫోన్‌కు నగదు బదిలీ అయినట్లు సందేశం వచ్చింది. కానీ అప్పటికే ఉన్నతాధికారి జాడ మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పలువురు ఉన్నతాధికారులు సదరు ఘాట్ వద్దకు చేరుకుని.. ఆదిత్యవర్థన్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


అందులోభాగంగా మోటారు బోటులతోపాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. కానీ ఆదిత్య వర్ధన్ మృతదేహం మాత్రం ఇప్పటికి లభ్యం కాలేదు. ఆదిత్య వర్ధన్ భార్య.. మహారాష్ట్రలో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారని సహాచర ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కథనం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఒక గజ ఈతగాడి దురాశ.. నిండు ప్రాణాన్ని బలికొన్నట్లు అయిందనే ఓ చర్చ సైతం వైరల్ అవుతుంది.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 02 , 2024 | 02:05 PM

Advertising
Advertising