ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Baal Aadhaar: మీ పిల్లల ఆధార్ ఇలా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి..

ABN, Publish Date - Aug 26 , 2024 | 07:20 PM

మీ పిల్లల ఆధార్ వివరాలను ఇంకా అప్‌డేట్ చేయలేదా. అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ గడువును ఇటివల కేంద్ర పొడిగించింది. ఈ నేపథ్యంలో పిల్లల ఆధార్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Update for baal aadhaar

ఆధార్ కార్డ్(aadhaar card) వివరాల అప్‌డేట్ విషయంలో మరో కీలక ప్రకటన వచ్చింది. అయితే ఈసారి పిల్లల ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. గడువు వ్యవధి తక్కువగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందుకోసం ఏం చేయాలి, ఎలా వివరాలను నమోదు చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ అప్‌డేట్ విషయంలో 5 నుంచి 7 సంవత్సరాల పిల్లలకు ఈ సేవలు ఉచితం.


అప్‌డేట్

మీ చిన్నారుల వేలిముద్ర, కనుపాప, ఫోటోలకు సంబంధించి సమాచారం అప్‌డేట్ చేసుకోవచ్చు. మీ బిడ్డకు 15-17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ షరతులు కాకుండా ఏ వయస్సులో ఉన్నా కూడా వారి వేలిముద్ర, కనుపాప, ఫోటోకు సంబంధించి ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే రూ. 100 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల జనాభా వివరాలు అంటే పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా వేలిముద్ర, ఐరిస్, ఫోటోను అప్‌డేట్ చేసుకునే సౌకర్యం ఉచితం. మీ పిల్లల పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామాకు సంబంధించి విడిగా ఆధార్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటే మాత్రం మీరు రూ. 50 రుసుం చెల్లించాలి.


ఒకవేళ మీరు పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామాకు సంబంధించిన పత్రాల అప్‌డేట్ కోసం సెప్టెంబర్ 14, 2024 వరకు My Aadhaar పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. కానీ ఈ సేవల కోసం మీరు ఆధార్ కేంద్రానికి వెళితే మాత్రం రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో పిల్లల ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసే ప్రక్రియ ఎలా అనేది ఇక్కడ చుద్దాం.

  • ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లాలి

  • ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

  • పిల్లల పేరు, తల్లిదండ్రుల మొబైల్ నంబర్, తల్లిదండ్రుల ఇమెయిల్ ID, ఇంటి చిరునామా, ప్రాంతం, రాష్ట్రం వంటి వివరాలను నమోదు చేయండి

  • ఫిక్స్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేయండి

  • మీ సమీపంలోని నమోదు కేంద్రాన్ని ఎంచుకుని, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి

  • అవసరమైన పత్రాలను తీసుకువెళ్లండి

  • ఫారమ్ రిఫరెన్స్ నంబర్, గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, సంబంధం రుజువు, పుట్టిన తేదీ వివరాలను పూరించండి

  • పిల్లల వయస్సు ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, పది వేళ్ల బయోమెట్రిక్, ముఖ ఫోటో, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు


తల్లిదండ్రుల వివరాలు

కానీ UIDAI వెబ్‌సైట్‌లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్స్ తీసుకోబడదు. అందుకోసం వారి తల్లిదండ్రుల UIDకి లింక్ చేయబడిన సమాచారం, ముఖ ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటుంది. మీ పిల్లలు 5 నుంచి 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు వారి పది వేళ్లు, ఐరిస్, ముఖ ఛాయాచిత్రాల బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేస్తారు. ప్రస్తుతం బాల్ ఆధార్ ప్రచారాన్ని అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పిల్లల బాల్ ఆధార్‌ వివరాలను నమోదు, అప్‌డేట్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.


ఇవి కూడా చదవండి:

Shri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు అరుదైన దృశ్యం

J-K Election: అభ్యర్థుల జాబితాను ఉపసంహరించుకున్న బీజేపీ...కొత్త జాబితా విడుదల

Ladakh: లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు.. కేంద్ర హోంమంత్రి ప్రకటన..


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 07:23 PM

Advertising
Advertising
<