US Ambassador: ఇక్కడికి అందుకే వచ్చాం.. భారత్‌పై అమెరికా రాయబారి సంచలన ప్రకటన..
ABN, Publish Date - Apr 10 , 2024 | 02:11 PM
భారతదేశంపై అమెరికా రాయబరి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్ తీర్చిదిద్దడంలో భారతదేశం ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్‌ను ఆస్వాదించాలని అనుకుంటే భారత్ రండి, ఇక్కడ పనిచేయాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: భారతదేశంపై (India) అమెరికా రాయబరి ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్ తీర్చిదిద్దడంలో భారతదేశం (India) ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్‌ను ఆస్వాదించాలని అనుకుంటే భారత్ రండి, ఇక్కడ పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో అమెరికా దౌత్య కార్యాలయంలో పనిచేయడం తనకు లభించిన గొప్ప అవకాశం అని అభిప్రాయ పడ్డారు. మేం ఇక్కడ పాఠాలు బోధించేందుకు రాలేదు, నేర్చుకోవడానికి వచ్చామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎరిక్ గార్సెట్టి పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలకు
భారత్- అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయ పడ్డారు. సాంకేతికత, భద్రతతోపాటు ఇతర రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఆయన వైట్ హౌస్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడిపై అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపాయి.
పూర్తి సహకారం
ఈ క్రమంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే అంశంపై భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా స్పందించారు. గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కేసు దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 10 , 2024 | 04:29 PM