Exam: బిగ్ అలర్ట్.. కానిస్టేబుల్ పరీక్ష రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..
ABN, Publish Date - Feb 24 , 2024 | 04:17 PM
పేపర్ లీక్ కారణంగా ఉత్తర ప్రదేశ్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ పరీక్ష రద్దు అయింది. మరో ఆరు నెలల్లో అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
పేపర్ లీక్ కారణంగా ఉత్తర ప్రదేశ్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ పరీక్ష రద్దు అయింది. మరో ఆరు నెలల్లో అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యువత జీవితంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి వాస్తవాలను పరిశీలించిన తర్వాత పరీక్షను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ హోం శాఖవెల్లడించింది. బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వచ్చే ఆరు నెలల్లో జరగనున్న రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులకు ఉచిత సౌకర్యాలు కల్పించాలని రవాణా శాఖను కోరినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
పరీక్షకు ముందే పేపర్ లీక్ అయిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విచారణ జరుపుతోంది. ఈ ఘటనపై నిరసనలు ఉద్ధృతం అయ్యాయి. రిక్రూట్‌మెంట్ రద్దు కావడంతో అభ్యర్థులందరికీ కాస్త ఉపశమనం లభించింది. పేపర్ లీకేజ్, రద్దు ఘటనలపై కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకా గాంధీ స్పందించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరారు. యువతలో ఆత్మవిశ్వాసం నింపేందుకు అన్ని పరీక్షలకు ఉచితంగా అప్లికేషన్లు స్వీకరించాలని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 24 , 2024 | 04:19 PM