Uttar Pradesh: అందరి దృష్టి ఆ నియోజకవర్గం మీదే..
ABN, Publish Date - May 12 , 2024 | 03:03 PM
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ లోని 13 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సోమవారంనాడు పోలింగ్ జరుగనుంది. ప్రధానంగా కన్నౌజ్ సీటు పైనే అందరి దృష్టి ఉంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు..
లక్నో: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని 13 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సోమవారంనాడు పోలింగ్ జరుగనుంది. ప్రధానంగా కన్నౌజ్ (Kannauj) సీటు పైనే అందరి దృష్టి ఉంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అఖిలేష్ యాదవ్, సిట్టింగ్ బీజేపీ ఎంపీ సుబ్రత్ పాథక్ మధ్య ఇక్కడ ప్రధానంగా పోటీ ఉంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని పోటీ చేస్తున్న ఖేరి నియోజకవర్గం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉన్నావోలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ తిరిగి పోటీ చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఉన్నావో మాజీ లోక్‌సభ ఎంపీ అనూ టాండన్ పోటీలో ఉన్నారు.
Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?
షాజహాన్ పూర్ (ఎస్‌సీ), ఖేరి, దౌరాహ్రా, సీతాపూర్, హర్దోయ్ (ఎస్‌సీ) మిస్రిఖ్ (ఎస్‌సీ), ఉన్నావో, ఫరూఖాబాద్, ఇటావా (ఎస్‌సీ), కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహరాయిచ్ (ఎస్‌సీ) నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది. 130 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ 13 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ 11 మంది సిట్టింగ్ ఎంపీలకు తిరిగి టిక్కెట్ ఇవ్వగా, కాన్పూర్ నుంచి రమేష్ అవస్థి, బహరాయిచ్ నుంచి ఆనంద్ కుమార్ అనే కొత్త అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది.
Read Latest National News and Telugu News
Updated Date - May 12 , 2024 | 03:03 PM