ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: ఆ కార్లపై ఆఫర్.. ఏంటి అంటే..?

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:27 PM

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది.

Hybrid Cars

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల (Hybrid Cars) రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది. పెట్రోల్, డీజిల్ కార్ల వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పనపై కంపెనీలు దృష్టిసారించాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ కీ డెసిషన్ తీసుకుంది.


100 శాతం మినహాయింపు..

మారుతిలో గ్రాండ్ విటారా, టాయోటాలో ఇన్నొవా హై క్రాస్, అర్బన్ క్రూజర్, హై రైడర్, హోండాలో అమేజ్ ఇతర కార్లపై 100 శాతం రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈవీ కార్లపై రోడ్ ట్యాక్స్ రాయితీ వచ్చే ఏడాది అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. మోడల్ కారును బట్టి రూ.1.80 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది.

Viral Video: బట్టలు ఆరబెట్టేందుకు.. బకెట్‌‌తో ఈమె చేసిన ప్రయోగం మామూలుగా లేదుగా..


వెల్ కం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ స్వాగతించింది. దీంతో ఈవీ వాహనాల కొనుగోలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈవీ వాహనాలపై రోడ్ ట్యాక్స్ రాయితీని హోండా కార్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహి స్వాగతించారు. 2050 ఏడాది వరకు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలని హోండా లక్ష్యంగా పెట్టుకుందని గుర్తుచేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు కలిసి వస్తుందని అభిప్రాయ పడ్డారు.


Read Latest
National News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 06:27 PM

Advertising
Advertising
<