Temple reopened: 45 ఏళ్ల తరువాత తెరుచుకున్న శివాలయం
ABN, Publish Date - Dec 14 , 2024 | 02:55 PM
ఖగ్గు సరై (Khaggu Sarai)లోని ఈ శివాలయం 1978 నుంచి మూతపడిందని, ఇన్నేళ్ల తర్వాత వెలుగుచూడటంతో సాంప్రదాయ రీతిలో తిరిగి ఆలయాన్ని తెరిచినట్టు నగర్ హిందూ సభ నిర్వాహకుడు విష్ణు శరణ్ రస్తోగి తెలిపారు.
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగిన హింసాకాండ ఇటీవల సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇదే జిల్లాలో 45 ఏళ్ల క్రితం నాటి ఒక పురాతన శివాలయం వెలుగు చూసింది. ఖగ్గు సరై (Khaggu Sarai)లోని ఈ శివాలయం 1978 నుంచి మూతపడిందని, ఇన్నేళ్ల తర్వాత వెలుగుచూడటంతో సాంప్రదాయ రీతిలో తిరిగి ఆలయాన్ని తెరిచినట్టు నగర్ హిందూ సభ నిర్వాహకుడు విష్ణు శరణ్ రస్తోగి తెలిపారు. ఇక్కడ నివసించే కొన్ని కుటుంబాలు వేరేచోటికి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆలయాన్ని పట్టించుకునే వాళ్లే లేకపోయారని ఆలయ చరిత్రను వివరించారు.
Arvind Kejriwal: అమిత్ షాకి అరవింద్ కేజ్రీవాల్ లేఖాస్త్రాం
ఆక్రమణలో...
కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం కోసం ఆలయాన్ని ఆక్రమించినట్టు తమ తనిఖీల్లో తేలిందని అదనపు ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. ఆలయాన్ని శుభ్రం చేశామని, ఆలయ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయంలో శివుడు, హనుమంతుడి విగ్రహాలు కనిపించాయని, ఈ ప్రాంతంలో నివసించే హిందూ కుటుంబాలు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాయని చెప్పారు. ఆలయం ముందు ఒక పురాతన బావి ఉండేదనే సమాచారంతో అక్కడ తవ్విచూడగా బావి ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు.
సంభాల్ హింసాకాండ
సంభాల్ లోని సాహి మసీదు ఉన్న ప్రాంతంలో ఆలయం ఉండేదని హిందూ కుటుంబాల వారు వేసిన పిటిషన్‌తో కోర్టు సర్వేకు ఆశించింది. ఇటీవల అక్కడ సర్వే చేపట్టేందుకు అధికారులు రావడంతో తలెత్తిన ఉద్రిక్తతలు ఘర్షణలకు దారితీశాయి. ఈ ఘర్షణల్లో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ఆ ఘటన అనంతరం అధికారులు పలు ఇళ్లకు విద్యుత్ నిలిపివేశారు. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున విద్యుత్ చోరీ జరిగందని విచారణలో వెల్లడైంది. లౌడ్ స్పీకర్లు, అక్రమ విద్యుత్ వినియోగం ఆ ప్రాంతంలోనూ, సమీపంలోని మసీదులోనూ జరిగినట్టు కనుగొన్నారు. మసీదులో 59 ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్‌లకు విద్యుత్‌ను అక్రమంగా వాడుకున్నట్టు నిర్ధారణ అయింది. ఆ ప్రాంతంలో అల్లర్లు, అక్రమ కార్యకలాపాలపై కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..
జస్టిస్ శేఖర్ యాదవ్‌పై అభిశంసన నోటీసు
For National News And Telugu News
Updated Date - Dec 14 , 2024 | 02:55 PM