ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh : ప్రాణాలు ‘తోడేలా’..

ABN, Publish Date - Sep 03 , 2024 | 02:37 AM

పులులో.. చిరుతలో కాదు..! ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లా ప్రజలను తోడేళ్లు వణికిస్తున్నాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలన్నరలోనే ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నాయి..

  • యూపీలో తోడేళ్ల దాడులతో దడ

  • నెలన్నరలోనే ఏడుగురు పిల్లల మృతి

  • బంధించడానికి ‘ఆపరేషన్‌ భేడియా’

  • 4 పట్టివేత.. రెండింటి కోసం గాలింపు

బహ్రయిచ్‌, సెప్టెంబరు 2: పులులో.. చిరుతలో కాదు..! ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లా ప్రజలను తోడేళ్లు వణికిస్తున్నాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలన్నరలోనే ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నాయి.. వీరిలో ఏడుగురు చిన్నారులే కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బహ్రయిచ్‌ జిల్లాలోని మహసి ప్రాంతంలోకి ఎక్కడినుంచి వచ్చాయో కానీ.. ఆరు నెలల్లో కిందట ఆరు తోడేళ్లు ప్రవేశించాయి. ప్రజలపై దాడి చేస్తూ పరిసర వంద గ్రామాలను హడలెతిస్తున్నాయి. ప్రతి నాలుగైదు రోజులకు ఒక కొత్త గ్రామాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రతిఘటించలేని వారు కావడంతో ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రాత్రివేళ ‘వేట’ పూర్తిచేసుకుని.. తెల్లారేసరికి గుహకు చేరిపోతున్నాయి. అంతేగాక ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తున్నాయి. కాగా, ఆదివారం రాత్రి రెండేళ్ల గరేటి గురుదత్‌ సింగ్‌ గ్రామంలో తల్లిపక్కన నిద్రిస్తున్న అంజలిని లాక్కెళ్లాయి. సోమవారం మౌజా కొటియా గ్రామంలో ఇద్దరు మహిళలను గాయపరిచాయి. హర్ది ప్రాంతంలో తెల్లవారుజామున ఐదేళ్ల పరా్‌సపై మెడ పట్టుకుని లాక్కెళ్తుండగా అతడి తల్లి గుడియా వీరోచితంగా పోరాడి తరిమేసింది.


ఆపరేషన్‌ భేడియా..

మహసిలో తోడేళ్ల బెడదపై యూపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ‘ఆపరేషన్‌ భేడియా’ చేపట్టింది. వాటి జాడ తెలుసుకునేందుకు డ్రోన్లు ఉపయోగించింది. ఉచ్చులు, బోన్లు పెట్టి నాలుగింటిని పట్టుకుంది. మిగతా రెండు మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. దీంతో.. మనిషి వాసనకు ఆకర్షితమై ఉచ్చులో చిక్కేందుకు.. ఆట బొమ్మలను పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు సంచరించే దగ్గర ఉంచుతున్నారు. కాగా, బహ్రయిచ్‌తో పాటు పొరుగునున్న సీతాపూర్‌ జిల్లాలోనూ తోడేళ్లు కలకలం రేపుతున్నాయి. యూపీ సీఎం యోగి సోమవారం పరిస్థితిని సమీక్షించారు. అటవీ శాఖ అధికారుల ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ తోడేళ్ల పనిపట్టాలని ఆదేశించారు.

Updated Date - Sep 03 , 2024 | 02:37 AM

Advertising
Advertising