Vande Metro Rail: చెన్నై-తిరుపతి వందే మెట్రోరైలు ట్రయల్ రన్
ABN, Publish Date - Apr 30 , 2024 | 01:24 PM
చెన్నై-తిరుపతి(Chennai-Tirupati) మధ్య వందే మెట్రో రైళ్లు నడిపేందుకు రెండు నెలలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
చెన్నై: చెన్నై-తిరుపతి(Chennai-Tirupati) మధ్య వందే మెట్రో రైళ్లు నడిపేందుకు రెండు నెలలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇదివరకే వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉండగా, 200 కి.మీ పరిధిలో ఉన్న నగరాలను అనుసంధానిస్తూ ఈ ఏడాది వందే మెట్రో రైళ్లు నడిపేందుకు భారత రైల్వే బోర్డు(Indian Railway Board) నిర్ణయించింది. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ... ఈ ఏడాది చివరిలోగా ఈ రైలు అందుబాటులోకి తీసుకురానున్నామని, ఒకటి, రెండు నెలల్లో వీటి ట్రయల్ రన్ ప్రారంభించనున్నామన్నారు.
ఇదికూడా చదవండి: Sukhesh Chandrasekhar: ఈసారి కేజ్రీని టార్గెట్ చేస్తూ సుఖేష్ లేఖ
ఒక వందే మెట్రోరైలు మూడు యూనిట్లు ఉంటాయని, ఒక యూనిట్ నాలుగు పెట్టెలు కలిగి ఉంటుందని తెలిపారు. మొదట 12 పెట్టెలతో నడిపి అవసరమైతే 16 పెట్టెలతో నడుపుతామన్నారు. మొదట ఏ మార్గంలో ఈ రైళ్లు నడపాలన్న ఖరారు కాలేదని, అయినప్పటికీ, ఢిల్లీ- రేవారి రూట్‌లో మొదటి మెట్రో నడిపే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే, చెన్నై-తిరుపతి(Chennai-Tirupati) మధ్య నడిపే మెట్రోరైళ్ల ట్రయల్ రన్ రెండు నెలల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Amit Shah: రేవణ్ణ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అమిత్ షా సూటిప్రశ్న
ఇదికూడా చదవండి: Greater Chennai: నగరంలో త్వరలో ‘ఎయిర్ టాక్సీ’ సేవలు!
Read Latest National News and Telugu News
Updated Date - Apr 30 , 2024 | 01:24 PM