Jagdeep Dhankar: కూరగాయల కత్తిని బైపాస్ సర్జరీకి వాడకూడదు: జగ్‌దీఫ్ ధన్‌ఖడ్
ABN, Publish Date - Dec 24 , 2024 | 08:03 PM
భావవ్యక్తీకరణ అనేది ప్రజాస్వామానికి నిర్వచనమని, అయితే అర్హమైన విధంగా భావ వ్యక్తీకరణ ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా ఉండకూడదని ధన్‌ఖడ్ అన్నారు. ఎవరైనా మాట్లాడేముందు ఇతరుల అభిప్రాయాలను కూడా వినేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
న్యూఢిల్లీ: ''కూరగాయల కత్తిని బైపాస్ సర్జరీకి ఉపయోగించ కూడదు'' అని రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankar) అన్నారు. రాజ్యసభలో తనపై విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసుపై మంగళవారం ఆయన తొలిసారి స్పందించారు.
Supreme Court: ఎన్నికల నిబంధనల్లో మార్పులపై సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్
"ఉపాధ్యక్షుడికి ఇచ్చిన నోటీసును మీరు చూస్తే మీరు దిగ్భ్రాంతి చెందుతారు. బైపాస్ సర్జీకి ఎన్నడూ కూరగాయల కత్తి ఉపయోగించకూడదని చంద్రశేఖర్ (మాజీ ప్రధాన మంత్రి) చెప్పేవారు'' అని ధన్‌ఖడ్ అన్నారు. ఈ నోటీసు కూరగాయలు కత్తికూడా కాదని, తప్పుపట్టి పోయిందని తెలిపారు. అందులో తొందరపాటుతనం ఉందని, అది చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని మహిళా జర్నలిస్టుల సమావేశంలో ధన్‌ఖడ్ చెప్పారు. ''నాకు ఆశ్చర్యం కలిగించినదేమిటంటే మీరెవరూ దానిని చదవి ఉండరు. చదవి ఉంటే మీకు కొన్ని రోజులపాటు నిద్రపట్టేది కాదు" అని వ్యాఖ్యానించారు.
భావవ్యక్తీకరణ అనేది ప్రజాస్వామానికి నిర్వచనమని, అయితే అర్హమైన విధంగా భావ వ్యక్తీకరణ ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా ఉండకూడదని ధన్‌ఖడ్ అన్నారు. ఎవరైనా మాట్లాడేముందు ఇతరుల అభిప్రాయాలను కూడా వినేందుకు సిద్ధంగా ఉండాలని, అది లేకుండా ప్రజాస్వామ్యం వికసించదని హితవు పలికారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు విభేదాలను పరిష్కరించే పొజిషన్‌లో ఉండరని, రాజ్యాంగ పదవులను తక్కువ చేసే ఎలాంటి ప్రయత్నాలైనా జాతి ప్రయోజనాలకు హాని చేస్తాయని పేర్కొన్నారు.
అసలేం జరిగింది..
జగదీప్ ధన్‌ఖడ్ అధికార పక్షానికి అనూకూలంగా ఉంటూ విపక్షాల పట్ల వివక్ష చూపుతున్నారంటూ గత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్ష పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసును రాజ్యసభలో ప్రవేశపెట్టాయి. దీనిపై 60 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. అయితే తనపై ఇచ్చిన నోటీసు కావడంతో నోటీసుపై నిర్ణయం తీసుకునేందుకు ధన్‌ఖడ్ విముఖత చూపారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆ నోటీసును తోసిపుచ్చారు. నిబంధనల ప్రకారం 14 రోజులకు ముందు నోటీసు ఇవ్వాలని, సమావేశాలు ముగియడానికి మరో నాలుగురోజులే ఉన్నందున నోటీసును నిరాకరిస్తున్నట్టు ప్రకటించారు.
ఇది కూడా చదవండి..
NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
Chennai: దిండివనం వద్ద పట్టాలపై పగుళ్లు
Delhi Assembly Elctions: సీఎంపై పోటీకి దిగుతున్నదెవరంటే..
For National News And Telugu News
Updated Date - Dec 24 , 2024 | 08:03 PM