ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vegetables : దడ పుట్టిస్తున్న ధరలు!

ABN, Publish Date - Jun 22 , 2024 | 02:58 AM

భారత్‌లో ఆహార ధరోల్బణం నెలకొంది. కూరగాయలు, పప్పుదినుసులు, పాలు.. ఏది కొందామన్నా ధరలు దడ పుట్టిస్తున్నాయి.

భారత్‌లో ఆహార ధరోల్బణం.. మండిపోతున్న కూరగాయల రేట్లు

పాలు, పప్పు దినుసుల ధరలు పైపైకి

వర్షాభావం, వేడిగాలుల ప్రభావం

‘నైరుతి’ ముందే వచ్చినా జోరందుకోని సాగు

ఆగస్టు వరకూ ధరలు తగ్గుదల లేనట్టే!

న్యూఢిల్లీ, జూన్‌ 21: భారత్‌లో ఆహార ధరోల్బణం నెలకొంది. కూరగాయలు, పప్పుదినుసులు, పాలు.. ఏది కొందామన్నా ధరలు దడ పుట్టిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం, వర్షాభావం, తీవ్రమైన వడగాడ్పుల కారణంగా కూరగాయలు, తృణధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీంతో గతేడాది నవంబరు నుంచి దేశంలో వార్షిక ఆహార ద్రవ్యోల్బణం 8శాతంగా ఉంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందే వచ్చినప్పటికీ ఈ నైరుతి సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు ఉన్నా ఆగస్టు వరకు ద్రవ్యోల్బణం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు అధికంగా ఖర్చుచేయాల్సి వస్తోంది.

ఆహార ద్రవ్యోల్బణానికి కారణం?

గతేడాది కరువు, ఈ ఏడాది ఇంకా కొనసాగుతున్న వడగాడ్పులతో పప్పుదినుసులు, కూరగాయలు, తృణధాన్యాల ఉత్పత్తి, సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు పెరిగిపోయాయి. దీని నుంచి ఉపశమనం కోసం ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించినా, దిగుమతులపై సుంకాలు తగ్గించినా పెద్దగా ప్రభావం చూపడంలేదు. సాధారణంగా వేసవిలో కూరగాయల ఉత్పత్తి తక్కువ ఉంటుంది. ఈ ఏడాది అది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు సగం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-9 శాతం అధికంగా నమోదవుతున్నాయి. దీనివల్ల పండించిన, నిల్వ చేసిన కూరగాయలు త్వరగా పాడైపోతున్నాయి. ఈ ఏడాది అధిక వేడి, నీటి ఎద్దడి కారణంగా నారు పోయడానికి, నాట్లు వేయడానికి ఆటంకం ఏర్పడింది. ఉల్లి, టమాటా, వంకాయ, ఆకుకూరల సాగుకి వేడి వాతావరణం ఆటంకం కలిగిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వార్షిక ద్రవ్యోల్బణం కూరగాయలకు 28శాతం, పప్పుధాన్యాలకు 17శాతం, తృణధాన్యాలకు 8.6శాతం, మాంసం, చేపలకు 8.2శాతం, సుగంధ ద్రవ్యాలకు 7.8శాతం, గుడ్లకు 7.1శాతంగా ఉంది.


రుతుపవనాలు వచ్చినా ఎందుకీ పరిస్థితి?

నైరుతి రుతుపవనాలు ఈసారి ముందే భారత్‌లోకి ప్రవేశించాయి. దేశమంతా వేగంగానే పురోగమించాయి. అయితే ఆరంభంలో ఉన్న వేగం ఆ తర్వాత క్షీణించింది. దీంతో ఈ నైరుతి సీజన్‌లో ఇప్పటి వరకు 18శాతం లోటు వర్షపాతం నమోదైంది. రుతుపవనాల బలహీనతకు వడగాడ్పులు తోడవడంతో పంటలసాగు ఆలస్యమవుతోంది. ముఖ్యంగా వరి, పప్పుధాన్యాలు, కూరగాయలు, సోయాబీన్స్‌ సాగుపై తీవ్ర ప్రభావంపడింది. జూలై తొలివారంలో వర్షాలు పెరిగితే లోటు వర్షపాతం నుంచి బయటపడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రుతుపవనాలు పుంజుకుని దేశవ్యాప్తంగా విస్తరించి వర్షాలు కురిస్తే ఆగస్టు నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే జూలై, ఆగస్టు నెలల్లో వరదలు లేదా ఎక్కువ రోజులు కొనసాగే పొడి వాతావరణం పంట ఉత్పత్తులపై ప్రభావం చూపొచ్చు. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండదు కాబట్టి పాలు, తృణధాన్యాలు, పప్పు దినుసుల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. గోధుమల ఉత్పత్తి క్షీణించినా ప్రభుత్వం దిగుమతి చేసుకునే చర్యలు తీసుకోలేదు. దీంతో వాటి ధరలు మరింత పెరిగే చాన్స్‌ ఉంది. ధాన్యం కనీస మద్దతు ధరను ప్రభుత్వం 5.4 శాతం పెంచడంతో బియ్యం ధరలు పెరగొచ్చు. గతేడాది కరువుతో కంది, మినుములు, శనగల సరఫరా తగ్గింది. ఈ సీజన్‌లో ఆ పంటలు పండి మార్కెట్‌కు చేరేవరకు వాటి ధరలు తగ్గే అవకాశం ఉండదు. ఆహార ద్రవ్యోల్బణం నేపథ్యంలో కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించడం, దిగుమతులకు సుంకా న్ని తగ్గించడంవంటి చర్యలను కేంద్రం చేపట్టింది. ధరల తగ్గుదలకు ఇది కొంతమేర సహాయపడుతుంది.

Updated Date - Jun 22 , 2024 | 02:58 AM

Advertising
Advertising