Gujarat: వారిపై దాడికి నమాజ్ ఒక్కటే కారణం కాదు.. వీసీ సంచలన ప్రకటన..
ABN, Publish Date - Mar 19 , 2024 | 11:10 AM
అహ్మదాబాద్‌లోని గుజరాత్ ( Gujarat ) యూనివర్సిటీ హాస్టల్‌లోకి ప్రవేశించిన కొందరు దుండగులు అక్కడ నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం కలగించింది. దీనిపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ నీర్జా గుప్తా స్పందించారు.
అహ్మదాబాద్‌లోని గుజరాత్ ( Gujarat ) యూనివర్సిటీ హాస్టల్‌లోకి ప్రవేశించిన కొందరు దుండగులు అక్కడ నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం కలగించింది. దీనిపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ నీర్జా గుప్తా స్పందించారు. విదేశీ విద్యార్థులకు స్థానిక సంస్కృతిపై అవగాహన లేకపోవడమే ఈ ఘటనకు దారితీసిందని అన్నారు. వారు మాంసాహారం తిని మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయడం మిగతా వారికి నచ్చలేదని చెప్పారు. లోకల్ కల్చర్, రూల్స్ పై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దాడి ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. బాధితులను శ్రీలంక, తజికిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు.
మరోవైపు దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, గాయపరచడం, ఆస్తి నష్టం వంటి నేరాలకు పాల్పడినందుకు 25 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు కరవయ్యాయని అధికార బీజేపీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం దృష్టి సారించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 19 , 2024 | 11:10 AM