Vinesh Phogat: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా
ABN, Publish Date - Sep 06 , 2024 | 02:46 PM
జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులు సమర్పించానని రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపారు.
న్యూఢిల్లీ: రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొద్ది గంటల ముందు ఇండియన్ రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా (resignation) చేశారు. తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఆ విషయాన్ని ఫోగట్ వెల్లడించారు. జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులు సమర్పించానని తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన రైల్వే శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Haryana Assembly Elections: కాంగ్రెస్‌లో చేరిన వినేశ్, బజరంగ్ పునియా
హర్యానా నుంచి పోటీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజ్‌రంగ్ పునియా శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినోష్ ఫోగట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉండగా, భజరంగ్ పునియాను హర్యానా ఎన్నికల ప్రచార కమిటీ కో-చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించే అవకాశం ఉంది. గత కొద్ది నెలలుగా హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఫోగట్ చేరనున్నారనే ప్రచారం బలంగా జరిగింది. అయితే దీనిపై ఫోగట్ ఆచితూచి వ్యవహరించారు. ఆగస్టు 31న శంభు సరిహద్దుల్లో 200 రోజులుగా నిరసనలు సాగిస్తున్న రైతుల ఉద్యమానికి మద్దతు పలికే సమయంలోనూ రాజకీయాల గురించి మాట్లాడే సందర్భం ఇదికాదని, రైతు ఉద్యమానికి మద్దతుగా తాను నిలుస్తానని చెప్పారు. రైతులకిచ్చే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే రైతుల డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు.
Read More National News and Latest Telugu News Click Here
Updated Date - Sep 06 , 2024 | 02:46 PM