Cigarettes Ban: ఈ రాష్ట్రంలో పొగాకు, సిగరెట్లు తాగడం నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
ABN, Publish Date - Nov 08 , 2024 | 09:44 AM
మీకు సిగరెట్లు తాగడం, గుట్కా తీసుకోవడం అలవాటు ఉందా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవన్నీ కూడా నిషేధం. ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా సిగరెట్(cigarettes) తాగినా, పొగాకు(tobacco) ఉత్పత్తుల వినియోగించినా కూడా చర్యలు తప్పవు. ఎందుకంటే వీటిపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. ఉత్తర్వు ప్రకారం సిగరెట్లు, గుట్కా లేదా ఏ రకమైన పొగాకు ఉత్పత్తులను ఏ ప్రభుత్వ కార్యాలయం లేదా ప్రాంగణంలో కూడా ఉపయోగించకూడదు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యం, కార్యాలయాల పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారు.
ఉల్లంఘిస్తే
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కర్ణాటకకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (DPAR) జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నో స్మోకింగ్’, ‘నో టుబాకో’ అనే బోర్డులను కూడా ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఈ నిబంధన గురించి తెలియజేయాలన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ని ఉదహరించింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగం పూర్తిగా నిషేధం. దీంతో పాటు కర్ణాటక(Karnataka) రాష్ట్ర సివిల్ సర్వీస్ రూల్స్ 2021లోని రూల్-31 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాల వినియోగంపై కూడా నిషేధం విధించబడింది.
ఆరోగ్యం పట్ల
ఉద్యోగులు, పౌరుల ఆరోగ్యం పట్ల కర్ణాటక ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ ఉత్తర్వు ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వోద్యోగుల కార్యాలయాలను పొగాకు రహితంగా మార్చడమే మా లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా ఉద్యోగులందరూ ఆరోగ్యవంతమైన పని వాతావరణాన్ని పొందగలరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సూచనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయ ఆవరణలో పొగాకు వినియోగం, ధూమపానం చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. కర్నాటక రాష్ట్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021లోని రూల్-31 కూడా బహిరంగ ప్రదేశంలో ఏదైనా మత్తు పానీయాలు లేదా మత్తు పదార్థాలను వినియోగించడాన్ని నిషేధిస్తుంది.
తెలంగాణలో కూడా..
అయితే కర్ణాటకలో ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో కూడా ఇవి అమలు చేస్తారా అని చర్చించుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో గతంలో కర్ణాటకలో ఉన్న మహిళలకు ఉచిత బస్ స్కీం తెలంగాణలో కూడా అమలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు, సిగరెట్ నిషేధం రూల్స్ ఇక్కడ కూడా వస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ రూల్స్ విషయంలో అక్కడి ఉద్యోగులు ఎలా స్పందిస్తారు. నిబంధనలు పాటిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
CPCB: కాలుష్యంతో ప్రతి ఏటా 33 వేల మరణాలు.. ఈ అధ్యయనంపై కేంద్రం ప్రశ్నలు
Narendra Modi: నేటి నుంచి రంగంలోకి ప్రధాని మోదీ.. 7 రోజుల్లో 9 ఎన్నికల ర్యాలీలు..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 08 , 2024 | 09:46 AM