ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడే ‘మహా’ పోలింగ్‌

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:01 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరగనుంది.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌

ఝార్ఖండ్‌లో తుది దశ, యూపీ ఉప ఎన్నికలకూ

ఈ నెల 23న ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ, నవంబరు 19 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్‌ జరుగుతుంది. నవంబరు 23, శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,70,25,119 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1,00,186 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కాగా, శివసేన(ఉద్దవ్‌ థాక్రే వర్గం), ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌ వర్గం), కాంగ్రెస్‌ పార్టీ కలిసి మహావికాస్‌ అఘాడీ పేరుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అలాగే, శివసేన(ఏక్‌నాథ్‌శిందే), ఎన్‌సీపీ(అజిత్‌పవార్‌), బీజేపీ కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నాయి. 149 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండగా 101 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. శివసేన(ఉద్దవ్‌ థాక్రే వర్గం) 95, ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌ వర్గం) 86, శివసేన(ఏక్‌నాథ్‌శిందే) 81, ఎన్‌సీపీ(అజిత్‌పవార్‌) 59 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాయి.

ఇది కాక, బీఎస్పీ 237 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ పడుతోంది. అన్ని పార్టీలు, స్వతంత్రులు, రెబల్స్‌ కలిపి మొత్తం 4,136 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఒక్క ముంబైలోనే 30వేల మందికిపైగా పోలీసులు ఎన్నికల విధు లు నిర్వహిస్తున్నారు. కాగా, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో, తుది దశ ఎన్నికల పోలింగ్‌ బుధవారం జరగనుంది. 38 శాసనసభ స్థానాలకు బుధవారం ఓటింగ్‌ నిర్వహించి నవంబరు 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఝార్ఖండ్‌లోని 43 స్థానాలకు సంబంధించిన పోలింగ్‌(తొలి దశ ఎన్నికలు) నవంబరు 13న జరిగింది. మరోవైపు, బీజేపీ, శివసేన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న యూపీలోని 9 శాసనసభ స్థానాల ఉపఎన్నికకు పోలింగ్‌ కూడా బుధవారమే జరగనుంది. 23న ఓట్లను లెక్కిస్తారు. కాంగ్రెస్‌ ఈ పోటీకి దూరంగా ఉంది.

Updated Date - Nov 20 , 2024 | 05:09 AM